స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో మొదటి స్థానంలో నిలపాలి

ABN , First Publish Date - 2022-12-10T00:40:01+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో సిరిసిల్ల మున్సిపల్‌ను అన్ని విభాగాల్లో మొదటి స్థానంలో నిలపాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు.

 స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో మొదటి స్థానంలో నిలపాలి
ర్యాలీలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 9: స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో సిరిసిల్ల మున్సిపల్‌ను అన్ని విభాగాల్లో మొదటి స్థానంలో నిలపాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023, సఫాయిమిత్ర సురక్షిత్‌ షహార్‌ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బతకమ్మ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ నియమాలతో ముద్రించిన సఫాయి మిత్ర సురక్షిత్‌ షమార్‌, టాయిలట్‌ 2.0 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు గతంలో సిరిసిల్ల మున్సిపల్‌కు ఎన్నో వచ్చాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో సిరిసిల్ల మున్సిపల్‌కు అవార్డులు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారం ఉందన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ సాధించిన అవార్డులతో మనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. 2023 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు సాధించేల ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్లు గెంట్యాల శ్రీనివాస్‌, అన్నారం శ్రీనివాస్‌, గూడూరు భాస్కర్‌, లింగంపల్లి సత్యనారాయణ, టీపీవో అన్సారీ, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆడెపు మురళి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:40:07+05:30 IST