‘కాళేశ్వరం’ రీడిజైన్‌ పేరిట వేల కోట్ల కమీషన్లు

ABN , First Publish Date - 2022-11-12T00:26:35+05:30 IST

కాళేశ్వ రం ప్రాజెక్టు రీడిజైన్‌ పేర రూ.36వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.2లక్షల కోట్లకు పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కమీషన్ల రూపంలో భారీగా దండుకున్నారన్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మి ల ఆరోపించారు.

‘కాళేశ్వరం’ రీడిజైన్‌ పేరిట వేల కోట్ల కమీషన్లు

గోదావరిఖని, నవంబరు 11: కాళేశ్వ రం ప్రాజెక్టు రీడిజైన్‌ పేర రూ.36వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.2లక్షల కోట్లకు పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కమీషన్ల రూపంలో భారీగా దండుకున్నారన్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మి ల ఆరోపించారు. శుక్రవారం రామగుం డంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం లోనే అతిపెద్ద కుంభకోణమని, దీనిపై కేంద్రం కమిషన్‌ వేసి విచారణ జరుపా లన్నారు. లక్ష కోట్ల పరిధి దాటితే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని కాళేశ్వరం కూడా కేంద్ర పరిధిలోకే వస్తుందన్నారు. దీనిపై కేంద్రం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశా రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరంను ఒక ఏటీ ఎంలా వాడుకుంటున్నారని, ఎప్పుడు డబ్బులు అవసరం వచ్చినా ఒక టీఎంసీ డిజైన్‌ పెంచి కమీ షన్ల పేర వేల కోట్లు దండుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 18లక్షల ఎకరాలకు సాగునీ రు ఇస్తామని చెప్పారని, కానీ 57వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు ప్రభుత్వం చెబుతోందన్నారు. నా లుగేళ్లలో 100టీఎంసీలు కూడా ఈప్రాజెక్టు నుంచి ఎత్తి పోయలేదన్నారు. అంచనాలు, టెండర్ల దగ్గర నుంచి మొదలు అన్నీ అక్రమాలే జరిగాయన్నారు. రెండు టీఎంసీల సామర్థ్యమే భారీ కుంభకోణమై తే ఇప్పుడు మూడవ టీఎంసీ పేర మరో కుంభకో ణానికి పాల్పడుతున్నారన్నారు. గ్లోబల్‌ టెండర్లు పిలువకుండా ప్రగతి భవన్‌లోనే కాంట్రాక్టర్లను పిలిచి కమీషన్లు మాట్లాడుకుని అనుమతులు ఇచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్య త లేకపోవడం వల్ల పంప్‌హౌస్‌లు నీట మునిగి రూ.1500కోట్ల నష్టం జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అందులో మర మ్మతులు చేస్తున్న విషయాన్ని కూడా బయటకు పొక్కకుండా కట్టడి చేశారని, స్థానికులను కాదని బీహార్‌ కార్మికులను తెచ్చి పనులు చేయిస్తున్నార న్నారు. రెండు టీఎంసీలకే పొలాలు, గ్రామాలు, పట్టణాలు మునుగుతున్నాయని, చివరికి మహా రాష్ట్రలోని సిర్వంచ రైతులు కూడా ఆందోళన చేస్తు న్నారన్నారు. ఇప్పుడు మూడవ టీఎంసీతో ఎవరికి ప్రయోజనమన్నారు. రాష్ట్రంలోని 80శాతం కాంట్రా క్టులు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నారని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులుక మునిగిపోవడం, మిషన్‌ భగీరథ కలుషిత నీరు తాగి చనిపోతున్నా అతనిపై చర్య లు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఇటు రాహుల్‌ గాంధీ, అటు కేంద్ర మంత్రి నిర్మలసీతారామన్‌ అంటున్నారని, కానీ ఎవరూ కూడా పోరాటం చేయడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌టీపీ ఒక్కటే దీనిపై పోరాడుతుందని, సీబీఐకి, కాగ్‌కు ఫిర్యాదులు కూడా చేసిందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు కాళేశ్వరం కమీషన్లతో నోళ్లు మూసుకున్నాయా అని ఆమె ప్రశ్నించారు. గతం లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దోస్తి కట్టాయని, ఇప్పుడు ఏమైందో కానీ తాము ప్రధాని పర్యటనను వ్యతి రేకిస్తున్నామని చెబుతున్నారన్నారు. వాస్తవానికి మోదీ అంటే కేసీఆర్‌కు భయమని, ఆయనకు ఎదురుపడే ధైర్యం లేక పిల్లిలా దాక్కుంటున్నాడ న్నారు. ఎదురుపడి విభజన హామీలపై నిలదీ యాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడగా లని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు బిట్ట రాంరెడ్డి, డాక్టర్‌ నగేష్‌, జిమ్మిబాబు, లుర్దురెడ్డి, రవి కుమార్‌ పాల్గొన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లక్షల కోట్ల అవినీతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పం దించాలని, దీనిపై విచారణ జరుపాలంటూ వైఎస్‌ ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌షర్మిల్‌ ప్రధాని నరేం ద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆమె బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను రామగుండంలో విడు దల చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రూ.4లక్షల కోట్ల భారం తెలంగాణ ప్రజలపై పడనున్నదని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2022-11-12T00:26:40+05:30 IST