రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోంది
ABN , First Publish Date - 2022-12-15T00:02:43+05:30 IST
రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రజా సంగ్రా మ యాత్ర గురువారం మధురానగర్, కురిక్యా ల, కొండన్నపల్లి మీదుగా సాగింది.
గంగాధర, డిసెంబరు 14: రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రజా సంగ్రా మ యాత్ర గురువారం మధురానగర్, కురిక్యా ల, కొండన్నపల్లి మీదుగా సాగింది. ఈ సంద ర్భంగా మంగపేటలో బండి సంజయ్ మాట్లా డుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన అవినీతిలో కురుకుపోయిందన్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసును పునరుద్ధరించి పూర్తి స్థాయిలో విచార ణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బీజే పీ పోరాటంతో టీఆర్ఎస్కు వణుకుపుట్టి బీఆర్ ఎస్‌గా పేరు మార్చుకుందన్నారు. యాత్ర కరీం నగర్, జగిత్యాల ప్రధాన రహదారి వెంట సాగు తూ రామడుగు మండలంలో ప్రవేశించింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సుద్దాల దేవ య్య, శోభ, పార్టీ మండలాధ్యక్షుడు కోల అశోక్, నియోజకవర్గ కార్యదర్శి పెరుక శ్రవణ్, నాయకులు వైద రామానుజం, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
నారాయణపూర్ ముంపు సమస్యను పరిష్కరించకపోవడం విచారకరం
నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు సమ స్య రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం విచారకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామయాత్ర సం దర్భంగా ఆయన మధురానగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు, మహిళలు మంగళ హారతుల తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణపూర్ ముంపు బాధితు లు తమ సమస్యను ఎంపీకి వివరించారు. చెరువు నిండితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకు ని గడపాల్సి వస్తుందని చెప్పారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయనను నారాయణపూర్, ఇస్తారుపల్లి, మంగపేట గ్రామస్థులు కోరారు. అనంతరం బండి సంజ య్ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఓట్లు వేయించుకుని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడం విచా రకరమని అన్నారు. తమ సమస్యలు పరిష్కరిం చాలని గంగాధర కారోబార్ల సంఘం అధ్యక్షుడు సత్యం వినతి పత్రం సమర్పించారు. శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధ త కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయ కులు వినతిపత్రం అందజేశారు. కొండన్నపల్లి లో వరద కాలువపై నిర్మించనున్న బ్రిడ్జితో ఇరు వైపుల వందల ఎకరాలు నీటమునిగి రైతులు నష్ట పోతారని బ్రిడ్జి ఎత్తును తగ్గించాలని రైతులు వినతి పత్రం సమర్పించారు.
వైరస్ కావాలా.. వ్యాక్సిన్ కావాలా తేల్చుకోండి
రామడుగు: బీఆర్ఎస్ అనే వైరస్ కావాలా.. బీజేపీ అనే వ్యాక్సిన్ కావాలా అని ప్రజలు తేల్చుకోవాలని బండి సంజయ్ కుమార్ అన్నా రు. ప్రజాసంగ్రామ యాత్రకు రామడుగు మం డలంలో ఘనస్వాగతం లభించింది. స్థానిక బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బండి సంజ య్‌కుమార్‌కు స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతో దేశం సుభిక్షంగా ఉందన్నారు. ప్రజాసంగ్రామ యా త్ర ముగింపు సభకు ప్రజలందరూ పెద్ద ఎత్తు న తరలిరావాలని పిలుపునిచ్చారు.
కొత్తపల్లి చేరుకున్న యాత్ర
కరీంనగర్ రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ నిర్వ హిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర బుధవారం రాత్రి కొత్తపల్లి పట్టణ కేంద్రానికి చేరుకుంది. జగిత్యాల రహదారిపై కొత్తపల్లి మీదుగా ప్రజా సంగ్రామ యాత్ర కరీంనగర్ వరకు సాగింది.