కృతజ్ఞత భావం లేని వ్యక్తి సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-03-16T05:43:33+05:30 IST

కృతజ్ఞత భావం లేని వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతి భారతీయ పౌరుడు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యంగ పరిరక్షణ వేదిక ఆర్గనైజింగ్‌ కన్వీనర్‌ మందకృష్ణ మాదిగ అన్నారు.

కృతజ్ఞత భావం లేని వ్యక్తి సీఎం కేసీఆర్‌
మాట్లాడుతున్న మందకృష్ణమాదిగ

కేసీఆర్‌ను మారిస్తేనే రాజ్యాంగ పరిరక్షణ

రాజ్యంగ పరిరక్షణ వేదిక ఆర్గనైజింగ్‌ కన్వీనర్‌ మందకృష్ణ మాదిగ 

జగిత్యాల అర్బన్‌, మార్చి 15: కృతజ్ఞత భావం లేని వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతి భారతీయ పౌరుడు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యంగ పరిరక్షణ వేదిక ఆర్గనైజింగ్‌ కన్వీనర్‌ మందకృష్ణ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్ధానిక దేవిశ్రీ గార్డెన్‌లో రాజ్యాంగ పరిరక్షణ యుద్దభేరి సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షిం చుకు నేందుకు ఏప్రిల్‌ 9న హైదరాబాద్‌లో జరగనున్న రాజ్యాంగ పరి రక్షణ యుద్దభేరి మహాసభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. అంబేడ్క ర్‌ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన సీఎం కేసీఆర్‌ను బడుగు, బల హీన వర్గాల వ్యతిరేకిగా భావించాలన్నారు. అంబేడ్కర్‌ పేరున ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిందిస్తే, నిరసనలు తెలిపితే కేసులు బనా యించి జైలుకు పంపిస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే ప్రజలు, ప్రతిప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారని, అందుకే ఎవరు ప్రశ్నించకుండా ఉండేందుకే సీఎం కేసీ ఆర్‌ రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగా న్ని మార్చాలంటున్న కేసీఆర్‌ను 2023లో మార్చాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.

 ఏడేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదు- కోదండరాం

 ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమి లేదని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. న్యాయకోవిదులు, నిష్ణాతుల ఆలోచనలు జోడించి రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కే దక్కిందన్నారు. ఏడేళ్ల పాలనలో రాజ్యాంగాన్ని సీఎం కేసీ ఆర్‌ ఏనాడు గౌరవించలేదన్నారు. రాజ్యాంగ మార్పుతో నియంతృత్వ పాలనవేళ్లూనుకునే ప్రమాదం ఉన్నందున రాజ్యాంగ పరిరక్షణకు ప్రజ లంతా సంసిద్దులు కావాలన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా రాజ్యాంగ పరిరక్షణ వేదిక బాధ్యులు, విద్యార్ధులు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-16T05:43:33+05:30 IST