కొండగట్టు ఆలయ అభివృద్ధి పట్టని పాలకులు

ABN , First Publish Date - 2022-03-05T06:39:52+05:30 IST

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీసీసీసీ అధికార ప్ర తినిధి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మేడిపెల్లి స త్యం ఆరోపించారు.

కొండగట్టు ఆలయ అభివృద్ధి పట్టని పాలకులు
సమావేశంలో మాట్లాడుతున్న సత్యం

ఫటీసీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం

మల్యాల, మార్చి 4: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీసీసీసీ అధికార ప్ర తినిధి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మేడిపెల్లి స త్యం ఆరోపించారు. కొండగట్టులో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయాలు ఆంధ్ర పాలకులతో నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్న సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వ చ్చాక కొండగట్టుకు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమ ని అన్నారు. సోమవారం ప్రవేశపెట్టి బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటా యించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యాదాద్రి, భద్రాద్రిపై చూపుతున్న ప్రేమ కొండగట్టుపై చూపడం లేదన్నారు. గత రెండు పర్యాయాలుగా స్థానిక ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందన వారే ఉ న్నప్పటికీ దేవస్థానం అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురా కపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ప్ర స్తుత ఎమ్మెల్యే కనీసం ఒక్కసారి కూడా శాసనసభలో కొండగట్టు అభివృద్ధి ప్రస్తావించలేదని కనీసం ఇక్కడి సమస్యలను సీఎం దృష్టి కి కూడా తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని దీనితో ఎమ్మెల్యే ని ర్లక్ష్యంపై స్పష్టంగా ఏర్పడుతుందని ఆరోపించారు. లక్షలాది భక్తుల ఇలవేల్పు అయిన కొండగట్టు అభివృద్ధిపై ప్రణాళిక సంఘం ఉ పా ధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ కవిత నైన సీఎం దృష్టికి తీసు కెళ్లి నిధులు కేటాయించేలా చొరవ చూపాలన్నారు. కనీస వసతులు, సౌ కర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రూ.100 కోట్లతో పాటు మాస్టర్‌ప్లాన్‌ కూడా రుపొందించాలని దీన్ని ఎమ్మెల్యే భాద్యతగా తీ సుకొని కొండగట్టు అభివృద్ధికి పాటు పడాలన్నారు. లేనిచో హన్‌ మాన్‌ భక్తులతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు దొంగ ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, మధుకర్‌రెడ్డి, ల క్ష్మారెడ్డి, శంకర్‌, ఇమామ్‌, నర్సింహారెడ్డి, గాజుల అజయ్‌, జీవన్‌రెడ్డి, శనిగారపు తిరుపతి పాల్గొన్నారు.

Read more