కొండగట్టులో ప్రారంభమైన పాదయాత్ర

ABN , First Publish Date - 2022-11-20T23:41:21+05:30 IST

రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు, 1955నుంచి 1970వరకు అమలులో ఉన్నటువంటి అర్థ సంచార జాతులకు ఉన్న రిజర్వేషన్‌ లు పునరుద్ధరించాలనే డిమాండ్‌తో యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో కొండగట్టు అంజన్న సన్నిధానం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.

 కొండగట్టులో ప్రారంభమైన పాదయాత్ర
యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటుకు పాదయాత్ర

మల్యాల, నవంబరు 20: రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు, 1955నుంచి 1970వరకు అమలులో ఉన్నటువంటి అర్థ సంచార జాతులకు ఉన్న రిజర్వేషన్‌ లు పునరుద్ధరించాలనే డిమాండ్‌తో యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో కొండగట్టు అంజన్న సన్నిధానం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అంజ న్న ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం యాదవులతో కలిసి సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌ పాదయాత్ర చేపట్టారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల, కుర్మలు ఆర్థికంగా, విద్య పరంగా అభివృద్ది చెందడానికి విదేశి విద్య సౌకర్యం కోసం యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏ టా బడ్జెట్‌లో రూ.5వేల కోట్టు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గొర్రెల పథకం ను నగదు బదిలీ రూపంలో అందించాలని, చట్టసభలలో దామాషా ప్రకారం రాజకీయ పార్టీలు యాదవులకు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ పాద యాత్ర 33 జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్య క్షుడు అల్లిక వెంకటేశ్వర్‌రావు యాదవ్‌, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వే ల్పుల స్వామియాదవ్‌, బల్కం మల్లేశం యాదవ్‌, జిల్లా యువజన విభాగం అ ధ్యక్షుడు కొక్కెర మల్లేశం యాదవ్‌, సంగ సత్యనారాయణయాదవ్‌, హన్మంతు, సంగ శ్రీనివాస్‌ పాల్గొన్నారు

మహాపాదయాత్రకు తరలిన యాదవులు

వెల్గటూర్‌: యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రా ములు కొండగట్టు నుంచిచేపట్టనున్న మహాపాద యాత్రకు ఆదివారం జిల్లా ప్ర ధాన ఆర్యదర్శి ఎలుక రాజు ఆధ్వర్యంలో మండలం నుండి యాదవులు భారీగా తరలివెళ్లారు. పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవ కా ర్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, ఎస్‌ఎన్‌టి రిజర్వేషన్లు కల్పించి వాటిని పునరు ద్ధరణ చేయాలనే డిమాండ్‌తో మేకల రాములు మహా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎలుక భగవాన్‌ యాదవ్‌, అమ్ముల నరేష్‌, బైకని రవి, జక్కుల రవి, కోట శ్రీశైలం, రాయమల్లు, కొమురయ్య శేఖర్‌ పాల్గొన్నారు.

మెట్‌పల్లి రూరల్‌ : యాదవుల కార్పొరేషన్‌, ఎస్‌ఎన్‌టీ రిజర్వేషన్‌ల గురించి కొండగట్టులో చేపట్టిన మహా పాదయాత్రలో ఆదివారం యాదవ్‌ మండలాధ్యక్షుడు గజనవేని మహేష్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నాయకులు పాల్గొన్నారు. మండలంలోని యాదవ్‌ సంఘం నాయకులు యాదవ్‌ యాత్రలో పాల్గొని సమస్యల పరిష్కరం కోసం ఎక్కడికైనా వెళ్లుతామని అన్నారు. యాత్రలో నాయకులు తిప్పనవేని రవియాదవ్‌, గొపినవెని రమేష్‌యాదవ్‌, మాదమ్‌ విష్ణుయాదవ్‌, స్వామియాదవ్‌, పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T23:41:21+05:30 IST

Read more