ఘంటసాల గానామృతాలు మరవలేనివి
ABN , First Publish Date - 2022-12-04T23:54:25+05:30 IST
మధుర గాయకుడు ఘంటసాల గానామృతాలు ఎన్నటి కీ మరవలేనివని మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ అన్నారు.
మంథని, డిసెంబరు 4: మధుర గాయకుడు ఘంటసాల గానామృతాలు ఎన్నటి కీ మరవలేనివని మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ అన్నారు. స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వర్‌రావు జయంతిని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్‌చౌక్‌లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఘంటసాల సంగీత విభావరి శ్రోతలను ఆలరించింది. ఈసం దర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఘంటసాల సుమధురంగా పాడిన సినిమా పాటలు ఎన్ని తరాలు గడిచినా వినసొంపుగానే ఉంటాయన్నారు. ఘంటసాల గానామృతా లు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఘంటసా ల మధురగీతాలు వింటే నిత్యం జీవితంలో అనేక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందే అవకాశముందన్నారు. అందుకనే మంథని ప్రాంత ప్రజల కోసం జడ్పీ చైర్మన్ పుట్ట మధు సహాయ సహకారాలతో ఏటా ఘంటసాల జయంతోత్సవాలను స్థానిక గాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. గాయకులు సర్వ బాపు, వనమామలై అరు ణదేవి, బజీల సత్తీ, కొత్త శ్రీనివాస్, బండు తదితరులు పాడిన ఘంటసాల గానామృతాలు సభికులను ఆలరించాయి. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్ ఆరెపల్లి కుమా ర్, వీకే రవి, రామడుగు మారుతి తదితరులు పాల్గొన్నారు.