ఇసుక రీచులను రద్దు చేసి రోడ్లను పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2022-09-24T05:35:34+05:30 IST

మానేరుపై ఏర్పాటు చేసిన ఇసుక రీచుల వల్ల రో డ్లన్నీ ధ్వంసం అవుతున్నాయని, రీచు లను రద్దు చేసి, రోడ్లను పునరుద్ధరిం చాలని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు డి మాండ్‌ చేశారు.

ఇసుక రీచులను రద్దు చేసి రోడ్లను పునరుద్ధరించాలి
పాదయాత్ర చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు

- మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు

ఓదెల, సెప్టెంబర్‌ 23: మానేరుపై ఏర్పాటు చేసిన ఇసుక రీచుల వల్ల రో డ్లన్నీ ధ్వంసం అవుతున్నాయని, రీచు లను రద్దు చేసి, రోడ్లను పునరుద్ధరిం చాలని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు డి మాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్త లు, ఆయా గ్రామాల ప్రజల మడక నుంచి పోత్కపల్లి, శానగొండ, బాయ మ్మపల్లి, ఇందుర్తి మీదుగా గుంపుల వరకు పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల సంక్షేమాన్ని, ఇబ్బందు లను పట్టించుకోని ప్రభుత్వం ఆదాయమే లక్ష్యంగా మానే రుపై ఇసుక రీచులను ఏర్పాటు చేసిందన్నారు. ఈ రీచుల వల్ల రోడ్లన్నీ ధ్వంసమై ప్రయాణం నరకయాతనగా మారిం దని ఆవేదన వ్యక్తం చేశారు. రీచుల వల్ల భవిష్యత్తులో భూ గర్భ జలాలు కూడా అడుగంటిపోనున్నాయన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్థానిక టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో రోడ్డు మంజూరైందని, త్వరలోనే పూర్తిచేస్తామని ఏడాదిన్న ర కాలం నుంచి క్షీరాభిషేకాలు చేయించుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని విమర్శించారు. ఇసుక లారీల వల్ల రోడ్లన్నీ ఛిద్రం అవుతున్నాయన్నారు. వందేళ్లుగా మానే రు నుంచి ఉచితంగా ఇసుక తీసుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వానికి సాండ్‌ ట్యాక్సీ కట్టి ఇసుక తీసుకోవా ల్సిన పరిస్థితి మారిందన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మానేరుపై ఇసుక రీచులను రద్దు చేసి ధ్వంసమైన రోడ్లన్నింటినీ పునర్నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌, పార్టీ నాయకులు మినుపాల ప్రకాష్‌ రావు, సాయిరి మహేందర్‌, నరహరి సుధాకర్‌రెడ్డి, రమేష్‌, రవీందర్‌రెడ్డి, బి శంకర్‌, పి శంకర్‌, డి సంతోష్‌రావు, బి రవిగౌడ్‌, రాజేశం, రాజు కొమురయ్య, వెం కటేశ్వర్‌ రావు, సుమన్‌రెడ్డి, మల్లేష్‌, రజనీకాంత్‌, రాజు, సం పత్‌, వినయ్‌, సదయ్య, తిరుపతి, అబ్బయ్యగౌడ్‌, సమ్మిరెడ్డి, రామలు, శ్రీనివాస్‌, భాస్కర్‌రెడ్డి, రాహుల్‌, సుమంత్‌, సంతో ష్‌, రంజిత్‌, రమేష్‌, దేవేందర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-24T05:35:34+05:30 IST