చెరువును చెరబడుతున్నారు..

ABN , First Publish Date - 2022-05-26T05:32:55+05:30 IST

జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న రాఘవాపూ ర్‌లోని పెద్ద చెరువును చెరబడుతున్నారు.

చెరువును చెరబడుతున్నారు..
రాఘవాపూర్‌ చెరువులో మట్టి లోడింగ్‌ పనులు

- రాఘవాపూర్‌ పెద్ద చెరువులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు

- ఒకే వే బిల్లుపై రెండు ట్రిప్పుల వరకు మట్టి తరలింపు

- నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోని అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న రాఘవాపూ ర్‌లోని పెద్ద చెరువును చెరబడుతున్నారు. నిబంధనలకు విరు ద్ధంగా విచ్చలవిడిగా చెరువు మట్టిని తరలించుకుపోతున్నా రు. పెద్ద ఎత్తున జేసీబీలను పెట్టి రోజుకు మూడు, నాలుగు వందల లారీల ట్రిప్పుల మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నా రు. పొద్దంతా గాకుండా రాత్రివేళల్లో కూడా మట్టిని అక్రమం గా జార వేస్తున్నారు. నామమాత్రంగానే వే బిల్లులను జారీ చేస్తున్నారని తెలుస్తున్నది. ఒకే వే బిల్లుపై రెండు ట్రిప్పుల మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ఈ విషయమై పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటివరకు చర్యలు చేపట్టడం లేదు. ప్రతి ఏటా వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇటుక బట్టీల యజమానుల కన్నంతా చెరువుల మట్టిపై పడుతుంది. ఏడాది, రెండేళ్లకు సరిపడా మట్టిని తరలించుకుపోయి స్టాక్‌ పెట్టుకుని ఇటుక లు తయారుచేస్తుంటారు. జిల్లాలో వందకు పైగా ఇటుక బట్టీ లు ఉన్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని, రామగిరి, కమాన్‌పూర్‌, ధర్మారం, తదితర ప్రాంతాల్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. జిల్లాలో తయారయ్యే ఇటుకకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యా ల, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్‌కు సరఫరా చేస్తున్నా రు. ప్రతి ఏటా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. ఈ వ్యాపారం చేసే యజమానులు అడు గడుగునా నిబంధన లను తుంగలో తొ క్కుతున్నా వారిచ్చే మామూళ్లకు తలొగ్గి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరి స్తుంటారు. మట్టి తర లింపులోనూ అక్రమా లు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 

చెరువు మట్టి కోసం దరఖాస్తు..

పెద్దపల్లి మండలంలోని రాఘావాపూర్‌ పెద్ద చెరువు మట్టి కోసం కొందరు ఇటుక బట్టీల యజమానులు మైనింగ్‌ అధి కారులకు దరఖాస్తు చేసుకున్నారు. మట్టి తరలింపులో అక్ర మాలు జరుగుతున్నాయని గమనించిన కలెక్టర్‌ ఏయే చెరువు ల్లో ఎంత మేరకు మట్టి తీసుకపోవచ్చనే విషయమై నీటి పారుదల శాఖాధికారులతో సర్వే చే యించారు. ఆ మేరకు మాత్రమే కావా ల్సిన పరిమాణానికి సీనరేజీ సొమ్ము చెల్లించి అంతే సమానంగా డిపాజిట్‌ చేసిన వారికి అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి ద్వారా వే బిల్లులు జారీ చేయాలని పేర్కొన్నారు. రాఘవాపూర్‌ గ్రామ పెద్ద చెరువు నుంచి మట్టిని తీసుక పోయేందుకు పలువురు ఇటుక బట్టీల యజమానులు దరఖాస్తు చే సుకున్నారు. ఇప్పటివరకు 40వేల ట న్నుల మట్టిని తీసుకపోయేందుకు అనుమతులు పొందారని చెబుతు న్నారు. మట్టిని ఎక్కడ ఎంత లోతులో తీయాలనే సంబంధిత దరఖాస్తుదారులకు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే మట్టి ని తరలించాలన్నారు. కానీ విచ్చలవిడిగా లోతు చేస్తూ మట్టి ని తరలిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. రాత్రివేళల్లో కూడా మట్టిని తరలిస్తున్నారు. మట్టిని తోడేందుకు 15నుంచి 20 జేసీ పీబీలను ఉపయోగిస్తున్నారు. 60 నుంచి 100 లారీల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. రోజుకు 300నుంచి 400ట్రిప్పుల లారీ లకు తగ్గకుండా మట్టిని తోడుకుపోతున్నారని గ్రామస్తులు చెప్పారు. వేబిల్లులు మాత్రం రోజుకు 200నుంచి 250లారీలకే ఇస్తున్నారు. ఒకే వే బిల్లుపై రెండు ట్రిప్పులు కొడుతున్నారని తెలుస్తున్నది. అలాగే వే బిల్లులో పేర్కొన్న మట్టికంటే ఓవర్‌ లోడ్‌తో తరలించుకుపోతున్నారు. మట్టి కోసం అనుమతులు పొందినవారు తమ బట్టీలకే గాకుండా ఇతర బట్టీలకు తరలి స్తున్నారు. చెరువును బాగా లోతు చేయడం వల్ల తమ భూ ములు జాలు వారతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు మట్టి తర లింపుపై విచారణ జరపాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-26T05:32:55+05:30 IST