పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలి
ABN , First Publish Date - 2022-12-16T23:47:51+05:30 IST
పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేలా చర్య లు తీసుకోవాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో శుక్రవారం పెండింగ్ కేసుల పురోగతిపై ఎస్పీ సింధు శర్మ సమీక్ష స మావేశం నిర్వహించి మాట్లాడారు.
ఎస్పీ సింధు శర్మ
జగిత్యాల టౌన్, డిసెంబరు 16: పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేలా చర్య లు తీసుకోవాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో శుక్రవారం పెండింగ్ కేసుల పురోగతిపై ఎస్పీ సింధు శర్మ సమీక్ష స మావేశం నిర్వహించి మాట్లాడారు. పెండిగ్‌లో ఉన్న కేసుల్లో త్వరగా పరిశోధ న పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రౌడీ, హి స్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంచాలన్నారు. చట్టవ్య తిరేఖ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయా లని ఆదేశాలు జారీచేశారు. కోర్టు జారీ చేసిన నాన్ బేయిలబుల్ వారెంట్లను తప్పించుకు తిరుగుతున్న నేరస్తులను పట్టుకుని కోర్టులో ప్రవేశ పెట్టాలన్నా రు. ఈ సమీక్ష సమావేశంలో డీఎస్పీ ప్రకాష్, ఎస్బీ ఇన్స్‌ఫెక్టర్ శ్రీనివాస్, సీఐలు కిషోర్, కృష్ణకుమార్, రమణ మూర్తి, లక్ష్మినారాయణ, కోఠేశ్వర్, మల్ల య్య, సరీలాల్, నాగేశ్వర్ రావు ఉన్నారు.