పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలి

ABN , First Publish Date - 2022-06-12T05:46:40+05:30 IST

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలి
ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు

- కమాన్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణుల ధర్నా

పెద్దపల్లి టౌన్‌, జూన్‌ 11 : పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చార్జీల పెంపుదలను నిరసిస్తూ శనివారం పార్టీ శ్రేణులతో కలిసి కమాన్‌ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి రాజీవ్‌ రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే నెలలో ప్రభుత్వం మూడు సార్లు బస్సుచార్జీలు పెంచి పేద, సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇన్నిసార్లు చార్జీలు పెరుగలేదన్నారు. గ్రామీణప్రాంత విద్యార్థుల చార్జీలు సైతం పెంచడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజ లపై భారం మోపే పనిగట్టుకున్నాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌ చార్జీ లు, నిత్యావసర ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నాయన్నారు. ఇప్పటికైనా పెంచిన బస్సుచార్జీలు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతటి అన్నయ్యగౌడ్‌, మినుపా ల ప్రకాష్‌రావు, దామోదర్‌రావు, గోపగాని సారయ్యగౌడ్‌, నూగిళ్ళ మల్లయ్య, సాయి రి మహేందర్‌, కొమ్ము శ్రీనివాస్‌, వెంకటేశ్వర్‌రావు, తాడూరి శ్రీమాన్‌, భూతగడ్డ సంపత్‌, బొడ్డుపెల్లి శ్రీనివాస్‌, సయ్యద్‌ మస్రత్‌, సర్వర్‌ పాషా, మందల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-12T05:46:40+05:30 IST