విద్యుత్‌ సవరణ బిల్లు విరమించుకోవాలని ఆందోళన

ABN , First Publish Date - 2022-08-09T06:03:57+05:30 IST

విద్యుత్‌ సవరణ బిల్లు విరమించుకో వాలని సోమవారం విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్టు ఆందోళన కార్య క్రమాలు చేపట్టారు.

విద్యుత్‌ సవరణ బిల్లు విరమించుకోవాలని ఆందోళన
నిరసన కార్యాక్రమంలో మాట్లాడుతున్న బొంకూరి రవీందర్‌

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 8 : విద్యుత్‌ సవరణ బిల్లు విరమించుకో వాలని సోమవారం విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్టు ఆందోళన కార్య క్రమాలు చేపట్టారు. విధులు బహిష్కరించి ట్రాన్స్‌కో జిల్లా కార్యాల యం నుంచి జెండా చౌరస్తా వరకు పెద్దఎత్తున ర్యాలీ తీశారు. డి ప్లొమా ఇంజనీర్ల సంఘం జిల్లా కార్యదర్శి బొంకూరి రవీందర్‌ మా ట్లాడుతూ ఈ బిల్లు ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా సంఘాలు ఏక మైనట్లు వివరించారు. ఈ బిల్లు అమలయితే విదుత్య్‌ శాఖ ఉద్యో గులు, వినియోగదారులు ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు. ఉద్యో గుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మద్దతు పలికారు. కార్యక్రమంలో ప్రభాకర్‌, రామనుజం, రాజ్‌కుమా ర్‌, బాలలింగం, అశోక్‌, సుదర్శన్‌, లక్ష్మీరాజం, రాజన్న, గోపాల్‌ సింగ్‌, శ్రీనివాస్‌, సత్యనారాయణ, ఇంజనీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T06:03:57+05:30 IST