అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-08T05:25:37+05:30 IST

అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభు త్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూక ర్‌ అన్నారు.

అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

- సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ 

పెద్దపల్లి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభు త్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూక ర్‌ అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవ ర్గ పరిధిలోని 125 మందికి 40లక్షల 79వేల 800 రూపాయల విలువైన ముఖ్యమం త్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి జడ్పీ చైర్మన్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందేవిధంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. బ డుగుబలహీన వర్గాల ప్రజలు అనారోగ్యం బారినపడి ఆసుపత్రి పాలయితే ఆరోగ్య శ్రీ వర్తించని వారికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. దరఖాస్తు చేసుకునే వారందరికీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశామన్నారు. ప్రజలందరికీ ఉచితంగా వైద్యాన్ని అందించేందుకు ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అందులో భాగం గా జిల్లాలోని రామగుండంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేశారన్నారు. పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, గ్రామాల్లోని సబ్‌సెంటర్లను పల్లె దవాఖానాలుగా తీర్చి దిద్దుతు న్నారన్నారు. అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్ర మంలో జడ్పీటీసీ బండారు రామ్మూర్తి, ఎంపీపీలు నూనేటి సంపత్‌, బండారి స్రవం తి శ్రీనివాస్‌, బాలాజీరావు, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, సర్పంచులు, ఎంపీ టీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T05:25:37+05:30 IST