దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ

ABN , First Publish Date - 2022-12-16T01:10:56+05:30 IST

దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

  దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ
సమావేశంలో మాట్లాడుతున్న ఆగయ్య

గంభీరావుపేట, డిసెంబరు 15: దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గంభీరావుపేట మండలం శ్రీగాధలో గురువారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హనుమాండ్లు ఆధ్వర్యంలో గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చిన్నచిన్న అభిప్రాయ బేధాలు ఏ ఊరిలోనైనా ఉంటాయని, వాటిని పక్కన పెట్టి ఏకతాటిపై ఉండాలని సూచించారు. గతంలో మండలానికి ఒకే సబ్‌ స్టేషన్‌ ఉండేదని, రెండు గ్రామాలకు లేదా మూడు గ్రామాలకు ఒక సబ్‌ స్టేషన్‌ ఉండడం అది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఘనతేనని అన్నారు. ఒకప్పుడు కరెంటు సమస్యతో సబ్‌ స్టేషన్లను ముట్టడించి, సిబ్బందిని నిర్బంధించే పరిస్థితులు ఉండేవని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదని అన్నారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్‌ కాలి పోతే పది రోజుల వరకు కరెంటు వచ్చేది కాదని, ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిన రోజే కొత్తది బిగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పర్శ హనుమాండ్లు ఆధ్వర్యంలో పార్టీలోకి పెద్ద ఎత్తున గ్రామస్థుల చేరికలు ఉంటాయన్నారు. సెస్‌ డైరెక్టర్‌గా బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి నారాయణరావును గెలిపించుకోవాలన్నారు. సమావేశంలో సర్పంచ్‌ కత్తుల బాబు, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు గోపాల్‌రావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, నాయకులు దయాకర్‌ రావు, సురేందర్‌ రెడ్డి, లక్ష్మణ్‌, దేవాగౌడ్‌ పాల్గొన్నారు

Updated Date - 2022-12-16T01:11:04+05:30 IST