అగ్రకుల నాయకత్వంలో బందీ అయిన తెలంగాణ

ABN , First Publish Date - 2022-09-10T06:27:15+05:30 IST

అగ్ర కులాల వారి నాయకత్వం తెలంగాణ బందీ అయిందని దళిత శక్తి పొగ్రామ్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ విశారదన్‌ మహా రాజ్‌ అన్నారు.

అగ్రకుల నాయకత్వంలో బందీ అయిన తెలంగాణ
చిన్నకలువలలో మాట్లాడుతున్న విశారదన్‌ మహారాజ్‌

- దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌

సుల్తానాబాద్‌, సెప్టెంబర్‌ 9 : అగ్ర కులాల వారి నాయకత్వం తెలంగాణ బందీ అయిందని దళిత శక్తి పొగ్రామ్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ విశారదన్‌ మహా రాజ్‌ అన్నారు. మండలంలోని చిన్నకలువల, సుగ్లాంపల్లి గ్రామాలలో దళిత శక్తి ప్రోగ్రాం ఆద్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు. స్వరాజ్య పాదయాత్ర పేరిట ఈ ఏడాది మార్చి 15 న నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో ప్రారంభించిన పది వేల కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమం శుక్రవారం సుల్తానాబాద్‌ కు చేరింది. ఈ సందర్భంగా విశారదన్‌ మహారాజ్‌ మాట్లాడుతూ అనేక ఉద్యమాలకు కార్మి క పోరాటాలకు కేంద్రంగా నిలిచిన పెద్దపల్లి ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా బీసీ లు, ఎస్సీలు, ఇతర అణగారిన వర్గాల వారు అధికారంలోకి రావాలని ఆకాంక్షిం చలేదన్నారు. వెలమ, రెడ్డి తదితర అగ్ర కుల నాయకులు ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలను అధికారంలోకి రాకుండా చేసి కేవలం ఐదు శాతం ఉన్న అగ్రకు లాల వారు ఆధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. తెలంగాణలో ఈ వెలమ, రెడ్డి రాజ్యాన్ని కూల్చి దళిత గిరిజన బీసీ మైనారిటీల స్వరాజ్యాన్ని సాధించుకుందా మని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌, లక్ష్మణ్‌, జిల్లా అద్యక్షులు గణేష్‌, కోకన్వీనర్‌ న్యాతరి శ్రీనివాస్‌, అవునూరి సతీష్‌, శంకరయ్య, రమేష్‌రావు కృష్ణ తదితరులు ఉన్నారు. 

Read more