పేదల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-09-28T06:16:11+05:30 IST

పేదల అభ్యున్నతి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండలం గోరంటాలలో రూ.కోటి 50 లక్షలతో 30 డబుల్‌ బెడ్‌ రూంలు ఇళ్ల నిర్మాణానికి మంగళవారం భూమిపూజ చేశారు.

పేదల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి
గోరంటాలలో బతుకమ్మ ఘాట్‌ను ప్రారంబిస్తున్న రవీందర్‌రావు

గంభీరావుపేట, సెప్టెంబరు 27: పేదల అభ్యున్నతి  తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని నాఫ్స్‌కాబ్‌  చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండలం గోరంటాలలో రూ.కోటి 50 లక్షలతో 30 డబుల్‌ బెడ్‌ రూంలు ఇళ్ల నిర్మాణానికి మంగళవారం  భూమిపూజ చేశారు.  10 లక్షలతో నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను  ప్రారంబించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని గోరంటాల గ్రామానికి 30 ఇళ్లు  మంజూరు  చేసినట్లు చెప్పారు.  సర్పంచ్‌ కొలుముల అంజమ్మబాల్‌రెడ్డి, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయలక్ష్మన్‌, ఎంపీపీ వంగ కరుణసురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, ఎంపీటీసీ ఎర్రం అంజిరెడ్డి, సింగిల్‌విండో వైస్‌ చైర్మెన్‌ రామాంజనేయులుగౌడ్‌, డైరెక్టర్‌ అంజిరెడ్డి, నాయకులు దయాకర్‌రావు, రాజారాం, మల్లేశం, సురేందర్‌, సుధాకర్‌, మహేష్‌ అభిలాష్‌ ఉన్నారు.  

Read more