విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించాలి

ABN , First Publish Date - 2022-09-24T05:34:16+05:30 IST

విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠశాలల్లో విద్యాబోధన చేయాలని, పిల్లల సామర్థ్యం పెంపునకు తొలి మెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, మన ఊరు-మన బడి పనుల పురోగతిని పెంచాలని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి వాకా టి కరుణ ఆదేశించారు.

విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించాలి
ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మిని సన్మానిస్తున్న వాకాటి కరుణ

- పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠశాలల్లో విద్యాబోధన చేయాలని, పిల్లల సామర్థ్యం పెంపునకు తొలి మెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, మన ఊరు-మన బడి పనుల పురోగతిని పెంచాలని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి వాకా టి కరుణ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆమె కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఎం హరిత, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణతో కలిసి తొలి మెట్టు కార్యక్రమం, మన ఊరు మన బడి గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. దీని అమలు కోసం ఉపాధ్యాయులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల పురోగతిని అప్డేట్‌ చేయాలన్నారు. ప్రతి మాసం తొలిమెట్టు కార్యక్ర మంపై సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌కు సూచిం చారు. పాఠశాలలో నిర్వహించిన బేస్‌ లైన్‌ ఫలితాల ఆధారంగా విద్యారుఉ్థల స్థాయిని తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో మదింపు చేసి టాంజరిన్‌ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఈ యాప్‌ ద్వారా ఉన్నతాధికారులందరూ పరిశీలిస్తారని అన్నారు. ఉపాధ్యాయులు తాము రూపొం దించిన పాఠ్య పథకాల ద్వారా మౌలిక సామర్థ్యాలను పెంపొందింపచేయాలని, తగిన బోధనోపకరణ పద్ధతు లను ఉపయోగించాలని సూచించారు. మన ఊరు మన బడి కింద మొదటి విడతలో చేపట్టిన 191 పాఠశాలల్లో జరుగుతున్న పనుల ప్రగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌ పనుల ఫొటోలను పరిశీలించారు. పూర్తి చేసిన పనుల ఫొటోలను ఆన్‌లైన్‌ వెంటవెంటనే అప్‌లోడ్‌ చేయాలన్నారు. పాఠశాలల తరగతి గదుల్లో, వరండాల్లో టైల్స్‌తో ఫ్లోరింగ్‌ చేయించాలని ఇంజినీర్లకు సూచించారు. డబ్బులకు కొరత లేదని, పనుల్లో ప్రగతిని చూపాలన్నారు. ఈ సమావేశంలో స్టేట్‌ పీడీ గాజర్ల రమేష్‌, సంయుక్త సంచాలకులు లక్ష్మినర్సమ్మ, స్టేట్‌ మోడల్‌ అధి కారి వినయ్‌, డీఈవో మాధవి, ఆర్‌అండ్‌బీ ఈఈ బి నర సింహాచారి, పీఆర్‌ ఈఈ మునిరాజ్‌, ఎంఈవోలు, తదిత రులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయురాలికి అభినందనలు

పెద్దపల్లి మండలం పుట్టపాక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి సేవలు ప్రశంసనీయమని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి అరుణ అన్నారు. విద్యార్థుల సామర్థ్య స్థాయిని పెంచేందుకు చేస్తున్న కృషిని గుర్తించిన కార్యదర్శి ఆమెను సన్మానించారు. కరోనా విప త్కర సమయంలో విద్యార్థుల కోసం పుట్టపల్లిలో వాల్‌ పేయింటింగ్స్‌, విలేజ్‌ లైబ్రరి కార్నర్‌, ప్రతి రోజు సాయం త్రం 5 నుంచి 6 గంటల వరకు విద్యార్థులు చదువుతూ వీడియో ద్వారా పంపే విధంగా పర్యవేక్షణ, ఆటపాటలతో విద్యాబోధన విధానాలను భాగ్యలక్ష్మి అమలు చేస్తున్నారని కరుణ అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సురేందర్‌, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం దేశం తదితరులు పాల్గొన్నారు. 

Read more