-
-
Home » Telangana » Karimnagar » Strict arrangements should be made for TET-MRGS-Telangana
-
టెట్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి
ABN , First Publish Date - 2022-06-08T05:06:29+05:30 IST
జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను కట్టుదిట్టంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అద నపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు.

- అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి కల్చరల్, జూన్ 7 : జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను కట్టుదిట్టంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అద నపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో టెట్ నిర్వహణపై అధి కారులతో ఆయన అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాలో దాదాపు 9వేల మంది అభ్యర్థులు టెట్ రాయడానికి దరఖాస్తు చేసు కున్నారని, వీరి కోసం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. టెట్ నిర్వహణ కోసం జిల్లాలో ఇతర శాఖల అధికారుల నుంచి 237మంది ఇన్విజిలేటర్‌లను, 87మంది హాల్ సూపరింటెండెంట్‌ల ను, 24మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామని, విద్యా శాఖ నుంచి 25డిపార్ట్‌మెంట్ అధికారులను సైతం నియమించామ న్నారు. ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 12న టెట్ నిర్వహించే సమయంలో పరీక్ష కేం ద్రాలకు ప్రశ్నపత్రాలు తరలించే సమయంలో అవసరమైన బందో బస్తు కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్షకు సం బంధించి నివేదిక సమర్పించే సమయంలో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లా విద్యాశాఖా ధికారి మాధవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.