చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-12-16T00:46:25+05:30 IST
చట్టవ్యతిరేక పనులకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఏసీపీ గిరిప్రసాద్ అన్నారు. కమాన్‌పూర్ మండలం పెంచికల్ గ్రామంలో రామగుండం సీపీ ఆదేశానుసారం పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఉత్తర్వుల మేరకు గురువారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా చట్టపరిధిలో పరిష్కరించనున్నట్లు తెలి పారు.
కమాన్‌పూర్, డిసెంబర్ 15 : చట్టవ్యతిరేక పనులకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఏసీపీ గిరిప్రసాద్ అన్నారు. కమాన్‌పూర్ మండలం పెంచికల్ గ్రామంలో రామగుండం సీపీ ఆదేశానుసారం పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఉత్తర్వుల మేరకు గురువారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా చట్టపరిధిలో పరిష్కరించనున్నట్లు తెలి పారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే సమా చారం ఇవ్వాలన్నారు. స్ర్కాప్ దుకాణం వాళ్లు ఎవరైనా కొత్త వ్యక్తు లు సింగరేణి, రైల్వే, కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌కి సంబంధించిన ఇనుము తీసుకొస్తే ఆధార్ కార్డు తీసుకొని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలు, 4 త్రీ వీలర్స్, ఒక ఫోర్ వీలర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖని టుటౌన్ సీఐలు వేణుగోపాల్, హౌసలుద్దీన్ అబ్జాలోద్దీన్, గోదావరిఖని వన్ టౌన్ ఎస్‌ఐ ప్రసాద్‌రావు, కమాన్‌పూర్ ఎస్‌ఐ షేక్ మస్తాన్, టుటౌ న్ ఎస్‌ఐ శ్యామ్‌పటేల్, రామగిరి ఎస్‌ఐ రవిప్రసాద్ పాల్గొన్నారు.