కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-10-17T05:38:16+05:30 IST
ఆహారానికి సంబంధించిన వాటిలో ఎలాంటి కల్తీ చేసినా, గడవు ముగిసిన ఆహారాన్ని, ప్యాకెట్లను విక్రయించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి అనూష హెచ్చరించారు.
- జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష
సుల్తానాబాద్, అక్టోబరు 16: ఆహారానికి సంబంధించిన వాటిలో ఎలాంటి కల్తీ చేసినా, గడవు ముగిసిన ఆహారాన్ని, ప్యాకెట్లను విక్రయించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి అనూష హెచ్చరించారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానా బాద్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆహారం, ఇతరత్రా వాటిని విక్రయించాలన్నా నిల్వ చేయలన్నా ప్రతీ ఒక్కరు ఫుడ్ గ్రైన్ లెసెన్స్ తీసుకోవాలని సూచించారు. ఆహర పదార్థాలను విక్రయించే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బూజుపట్టిన, పురుగులు పట్టిన వాటిని విక్రయించకూ డదని వాటిని గుర్తించి వెంటవెంటనే బయట పడవేయాలని సూచించారు. వినియోగదారులు ఆహార పదార్థాలు ఇతర నిత్యావసర సరుకులును సునిషితంగా పరిశీలించాలని, వాటి గడువు తేదీని తెలుసుకోవాలని అన్నా రు. గడువు ముగిసిన, పురుగులు పట్టిన కొన్ని షాంపిళ్లను అధికారులు గుర్తించి వాటిని పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.