మెడికల్‌ కళాశాల పనులను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-09-10T06:22:00+05:30 IST

రామగుండం మెడికల్‌ కళా శాల పనులను శుక్రవారం కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ పరిశీలించారు.

మెడికల్‌ కళాశాల పనులను వేగవంతం చేయండి
మెడికల్‌ కళాశాల భవనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 9: రామగుండం మెడికల్‌ కళా శాల పనులను శుక్రవారం కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ పరిశీలించారు. సింగరేణి నిధులతో నిర్మాణమవుతున్న కళా శాల నిర్మాణ పనులను కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసు కున్నారు. ఈ ఏడాది కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం కాను న్నందున పనులను వేగవంతం చేయాలని సూచించారు. రూ.500 కోట్ల సింగరేణి నిధులతో ప్రభుత్వం కళాశాల నిర్మా ణానికి శ్రీకారం చుట్టింది. దాదాపు బిల్డింగ్‌లోని బ్లాకుల నిర్మా ణం చివరి దశకు చేరుకున్నాయి. సివిల్‌, ఎలక్ర్టికల్‌ పనులు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా సింగరేణి యాజమాన్యం త్వరగా చేపట్టాలని కలెక్టర్‌ కోరారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు సింగ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ నరేందర్‌, ప్రొఫెసర్లు అనిల్‌, రాహుల్‌ ఉన్నారు.

Read more