సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-08-04T06:08:16+05:30 IST

గురుకులాలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా తాగునీటి సరఫరా, టాయి లెట్ల వినియోగంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ అను రాగ్‌ జయంతి అన్నారు.

సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

 సిరిసిల్ల, ఆగస్టు 3 (ఆంరఽధజ్యోతి): గురుకులాలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా తాగునీటి సరఫరా, టాయి లెట్ల వినియోగంపై దృష్టి సారించాలని  కలెక్టర్‌ అను రాగ్‌ జయంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండు రోజులపాటు జిల్లా లోని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను జిల్లా అధికారులు  తనిఖీలు చేసి నివేదికలు అందించిన దా నిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. గురుకులాలు, వసతి గృహాల్లో అత్యవసరంగా పరిష్క రించాల్సిన సమస్యలపై దిశానిర్దేశం చేశారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యార్థులకు జ్వరాలు, మరుగుదొడ్ల వినియోగం, నాణ్యమైన సరుకులు ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసు కున్నారు. ప్రత్యేక అధికారులు తనిఖీ చేసి నివేదిక అం దించినా నిర్వహణ బాధ్యత వసతి గృహాల సంక్షేమ అధికారులదేనని అన్నారు. సాధారణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వంటగదులు, స్టోర్‌రూంలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. టాయిలెట్‌లకు నీటి సరఫరా అయ్యేలా వినియోగంలో ఉండేలా చూడా లన్నారు. విద్యార్థులకు మోనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలన్నారు. దోమలు వృద్ధి కాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సమస్యలు ఉంటే జిల్లా ఆసుపత్రికి, ఏరియా ఆసుపత్రులకు పంపిం చాలన్నారు. జిల్లాలోని  గురుకులాలు హాస్టళ్లలో సిబ్బ ంది అక్కడే నివాసం ఉండాలన్నారు. ఆదేశాలు భేఖాతరు చేస్తే చర్యలు తప్పవన్నారు. హాస్టళ్లలో విద్యా ర్థులు దోమకాటుకు గురికాకుండా చర్యలు చేపట్టా లన్నారు. ఆర్వో ప్లాంట్‌, వాటర్‌ హీటర్‌లు ఉండి నిరుప యోగంగా ఉంటే మరమ్మతు చేయాలన్నారు. మాస్కిటో మిషన్లను సమకూర్చాలన్నారు. మిషన్‌ భగీరథ నీటిని సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శాఖా పరంగా నిధులు లేకుంటే ప్రతీ పాదనలు పంపించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో  అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, డీఈవో రాధాకిషన్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకులాల రీజినల్‌ కో ఆర్డినేటర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T06:08:16+05:30 IST