పట్టణాలకు సోయగం

ABN , First Publish Date - 2022-01-03T06:53:48+05:30 IST

ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది.

పట్టణాలకు సోయగం

బల్దియాల్లో ప్రకృతి వనాలు

వార్డుకో ట్రీపార్క్‌ ఏర్పాటుకు చర్యలు

పట్టణ ప్రగతి నిధుల కేటాయింపు

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

జగిత్యాల టౌన్‌, జనవరి 2 : ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. ఇప్పటికే హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటి ప్రజలందరికి స్వఛ్చమైన ప్రాణవాయు వు ను అందించే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్ర కృతి వనాలను ఏర్పాటు చేసి పట్టణాల్లో ఉన్న పార్కుల మాదిరిగా తీర్చి దిద్దారు. అదే తరహాలో మునిసిపాలిటీల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకొసం ఒక్కో పార్కు నిర్మాణానికి రూ. 2 నుంచి రూ. 5 లక్షలను కేటాయించింది. పట్టణ ప్రాంతాల్లో జనాభా దృష్టా పట్టణ ప్రకృతి వనాల తో పాటు ప్రతి వార్డుకో ట్రీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రకృతి వనాలు...

జగిత్యాల జిల్లాలో జగిత్యాలతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రా యికల్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడత లు గా పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి నిధులను కేటాయిం చింది. ముఖ్యంగా పట్టణాలను సుందరీకరణ కోసం వేగంగా అడుగులు వేసేలా చర్యలు చేపట్టింది, కాలుష్య కోరల్లోనుంచి ప్రజలను విముక్తి చేసేందుకు పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జగి త్యాల పట్టణంలో సూమారు 1.50 లక్షలకు పైగా జనాబా ఉండగా కేవ లం ఒక పార్కు మాత్రమే ఉండడంతో పట్టణ ప్రజలకు అహ్లాదం కరు వైంది. దీంతో మియావాకి యాదాద్రి తరహాలో పట్టణంలోని తారక రా మనగర్‌లో  రెండు ఎకరాల స్థలంలో సూమారు 10 వేల మొక్కలతో తె లంగాణకు తలమాణికంగా పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 200 రకాల వివిధ పండ్ల, పూల ఇలా అన్ని రకాల మొక్కలతో పట్టణ ప్రజలకు ప్రకృతి సోయగాన్ని అందిస్తోంది. ఇటీవల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తారకరామ నగర్‌లో ఉన్న ప్రకృతి వనాన్ని సం దర్శించి కాసేపు సేద తీరారు. దీంతో పాటు మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేలా ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు అహ్లాదం కోసం పట్టణ ప్రకృతి వనాలను సందర్శిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వార్డుకో ట్రీ పార్క్‌ ఏర్పాటుకు చర్యలు..

పట్టణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉన్న దృష్టా వార్డుకో ట్రీ పార్క్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య స ముదాయాలు, కళాశాలు, పాఠశాలలు, మైదానాలు ఇలా పలు చోట్ల నా లుగు నుంచి ఐదు గుంటల స్థలాలు ఉన్న ప్రాంతాల్లో ట్రీ పార్కుల ఏ ర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 134 వార్డులు ఉన్నాయి. దీంతో అన్ని మున్సిపాలిటీల్లోని కమిషనర్లు ట్రీ పార్కులకోసం అణువైన స్థలాలను గుర్తించారు. అటవీశాఖ సహకారం తో ఒక్కో ట్రీ పార్కులో అందాన్ని ఇచ్చే 100 మొక్కలు ఏర్పాటుకు చర్య లు చేపట్టారు. పార్కు చుట్టూ ప్రజలు సేదతీరేవిధంగా బెంచీల ఏర్పా టు చేసేందుకు చర్యలు చేపట్టారు. ధర్మపురిలో 15 వార్డుల్లో 12 చోట్ల స్థ లాలు గుర్తించి మూడు చోట్ల ఇప్పటికే 4,300 మొక్కలు నాటారు. జగి త్యాలలో 48 వార్డులు ఉండగా 25 చోట్ల ట్రీ పార్కులు ఏర్పాటు చేసి 29,301 మొక్కలు నాటారు. కోరుట్లలో 33 వార్డుల్లో 10 చోట్ల 26,000 మొక్కలు, మెట్‌పల్లిలో 26 వార్డుల్లో ఏడు ప్రాంతాల్లో 12200, రాయికల్‌ లో 12 వార్డుల్లో రెండు చోట్ల 4,000 మొక్కలు ఇప్పటికే నాటారు. జిల్లా వ్యాప్తంగా 134 వార్డుల్లో 104 చోట్ల ట్రీ పార్కులు ఏర్పాటుకు చర్యలు చేపట్టగా75,801 మొక్కలు నాటి పట్టణాలను పచ్చదనంగా మార్చారు.

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

అరుణ శ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, 

ప్రజల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. కాలుష్యం త గ్గించేందుకు, పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాం. వార్డుల్లో పచ్చదనం వెల్లివిరిసేలా ట్రీ పార్కు ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ట్రీ పార్కుల ఏర్పాటుకు అణువైన స్థలాలను గుర్తించాం.

పట్టణ ప్రకృతి వనంలో 10 వేల మొక్కలు..

బోగ శ్రావణి, చైర్‌ పర్సన్‌, జగిత్యాల బల్దియా

జగిత్యాల బల్దియాలోని తారకరామ రామనగర్‌లో యాదాద్రి మియా వాకి పారెస్టు తరహాలో చిన్న చిట్టడవిలాగా పట్టణ ప్రకృతి వనాన్ని ఏ ర్పాటు చేశాం. 10 మొక్కలు నాటాం. పట్టణాన్ని పచ్చని హరిత పట్టణం గా మార్చడమే మా లక్ష్యం. 13 చోట్ల ట్రీ పార్క్‌ల ఏర్పాటు పనులు చక చకా సాగుతున్నాయి. ప్రజలు పట్టణ ప్రకృతి వనాలను ఉపయోగిం చుకుని ఆహ్లాదం పొందాలి.


Read more