అధికారుల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-09-11T05:29:18+05:30 IST

ఆర్‌జీ-1 ఏరియాలో పని చేస్తున్న అధికారుల సమస్యలు పరిష్కరించాలని శనివారం ఆర్‌జీ-1 జీఎంకు అధికారుల సంఘం వినతి పత్రం అందజేసింది.

అధికారుల సమస్యలు పరిష్కరించండి
జీఎంకు వినతి పత్రం అందజేస్తున్న అధికారుల సంఘం నాయకులు

గోదావరిఖని, సెప్టెంబరు 10: ఆర్‌జీ-1 ఏరియాలో పని చేస్తున్న అధికారుల సమస్యలు పరిష్కరించాలని శనివారం ఆర్‌జీ-1 జీఎంకు అధికారుల సంఘం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా సీఎంఓఏఐ అధ్యక్షుడు పొనగోటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉత్పత్తి, ఉత్పాతదక లక్ష్యం కోసం అధికారులు పనిచేస్తున్నా ఆర్‌జీ-1లో క్వార్టర్ల కేటాయింపులో సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ అయిన బంగ్లాస్‌ ఏరియాలో అడిషనల్‌ జనరల్‌ మేనేజర్లకు,  డిప్యూటీ జనరల్‌ మేనేజర్లకు, ఇతర హెచ్‌ఓడీలకు సరైన క్వార్టర్లు అందుబాటులో లేవని, క్వార్టర్లు ఖాళీ లేకపోవడం వల్ల తమకు అన్యాయం జరుగుతుం దని, బదిలీల సమయంలో గెస్ట్‌హౌస్‌లో, తాత్కాలిక గృహాల్లో నివాసముంటున్నామని, తాము పూర్తి స్థాయిలో విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, క్వార్టర్ల కేటాయింపుల్లో అధికా రులకు ప్రాధాన్యత ఇవ్వాలని, సింగరేణేతరులకు గెటెడ్‌ కమ్యూనిటీ కాలనీలో కాకుండా ఇతర క్వార్టర్లను కేటాయించాలని జీఎంను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో అధికారుల సంఘం నాయకులు రాంమోహన్‌, లక్ష్మీనారాయణ, రామ కృష్ణ, నవీన్‌, మదన్మోహన్‌, రాజ్యం, ప్రభాకర్‌, సుబ్రహ్మణ్యం, వీరారెడ్డి, దాసరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Read more