సొసైటీలు, మినీ డెయిరీలను ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2022-01-13T05:57:28+05:30 IST
జిల్లాలో సొసైటీలను ఏర్పాటు చేయాలని, మంజూరైన మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అఽఽధికారులను ఆదేశించారు
- కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 12: జిల్లాలో సొసైటీలను ఏర్పాటు చేయాలని, మంజూరైన మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అఽఽధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాకు 2వేల మినీ డెయిరీ యూనిట్లు మంజూరైట్లు తెలిపారు. మినీ డెయిరీ ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షలు ఉంటుందన్నారు. యూనిట్ ధరలో 70 శాతం సబ్సిడీ 30 శాతం బ్యాంక్ రుణం ఉంటుందన్నారు. లబ్ధిదారుల గుర్తింపు నమోదు, ఇతర ఆర్థిక చేయూత పథకాల్లో అనుసరించిన విధంగానే చేపట్టాలన్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు అన్ని మండలాల నుంచి 516 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయ్యాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. పాలు సేకరించడానికి కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటికి సంబధించిన రూట్ మ్యాప్‌లను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బల్క్ కూలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని, దానికి సంబంధించిన నివేదికలు రెండు రోజుల్లో ఎంపీడీవో అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్‌కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రంగారెడ్డి, జిల్లా సహకార అధికారి బుద్ధనాయుడు, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, విజయ డెయిరీ డీడీ గోపాల్‌సింగ్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.