అభివృద్ధి పథంలో సిరిసిల్ల

ABN , First Publish Date - 2022-02-23T06:43:12+05:30 IST

మంత్రి కే తారకరామారావు సహకారంతో సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తోందని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

అభివృద్ధి పథంలో సిరిసిల్ల
సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్న కొండూరు రవీందర్‌రావు

- నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 22: మంత్రి కే తారకరామారావు సహకారంతో సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తోందని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం 32, 35 వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణ పనులకు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కొండూరు రవీందర్‌రావు మాట్లాడుతూ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యమిస్తోందన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వార్డు కౌన్సిలర్లు సీమబేగంఅక్రం, దూస వినయ్‌ మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ సహాయ సహకారాలతో పట్టణ అభివృద్ధి చెందుతోందని, సిరిసిల్ల నేత కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం  శ్రీవెంకటేశ్వర ఫౌండేషన్‌ (ఎన్‌జీవో)ఆధ్వర్యంలో శిక్షణ కోర్సులను పూర్తి చేసుకున్న మహిళలకు  సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్లు కల్లూరి రాజు, గడ్డం లత, అన్నారపు శ్రీనివాస్‌, ఆకుల కృష్ణ, లింగంపల్లి సత్యనారాయణ, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సలీం, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షుడు కొమెర సంజీవ్‌గౌడ్‌, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు బత్తుల వనజ, కార్యదర్శి సయ్యద్‌ తస్లీం, అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ నేరళ్ల శ్రీకాంత్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అక్రమ్‌, అడ్డగట్ల మురళీ, దార్ల సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

 రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు 

సిరిసిల్ల పట్టణం శివారులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు   మంగళవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,  రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షుడు కొమిరె సంజీవ్‌గౌడ్‌, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర  నారాయణగౌడ్‌, గౌరవ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్‌, నాయకులు  అంజయ్యగాడ్‌, బండారి శ్రీనివాస్‌, పర్కాల అంజయగౌడ్‌, వికృత్తి పర్శరాములుగౌడ్‌, బుర్ర రాంచంద్రగౌడ్‌, వైద్య శివప్రసాద్‌ పాల్గొన్నారు.

Read more