బీజేపీ ఆధ్వర్యంలో శమీ యాత్ర

ABN , First Publish Date - 2022-10-07T05:42:19+05:30 IST

విజయదశమి పర్వదినం సందర్భంగా వేములవాడ పట్టణంలో బీజేపీ నాయకులు ఎడ్లబండ్లపై శమీయాత్ర నిర్వహించారు.

బీజేపీ ఆధ్వర్యంలో శమీ యాత్ర
ఎడ్ల బండిపై శమీ యాత్ర నిర్వహిస్తున్న ప్రతాప రామకృష్ణ

 -ఆకట్టుకున్న ఎడ్లబండ్ల పరుగులు

వేములవాడ, అక్టోబరు 6: విజయదశమి పర్వదినం సందర్భంగా వేములవాడ పట్టణంలో బీజేపీ నాయకులు  ఎడ్లబండ్లపై శమీయాత్ర నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో బుధవారం పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు ఎడ్లబండ్లపై జమ్మి కోసం మహాలక్ష్మి దేవాలయం సమీపంలోని జమ్మి వృక్షం వద్దకు వెళ్లి శమీపూజ నిర్వహించారు.  కార్యక్రమంలో జిల్లా బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్‌, పట్టణ బీజేపీ అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు, నాయకులు సంటి అంజిబాబు, పిన్నింటి హన్మాండ్లు, రేగుల రాజు, విష్ణు పాల్గొన్నారు. 

Read more