లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవాలి

ABN , First Publish Date - 2022-07-06T05:43:09+05:30 IST

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవాలని డీఈవో మాధవి అన్నారు.

లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో మాధవి

- డీఈవో మాధవి

ఓదెల, జూలై 5: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవాలని డీఈవో మాధవి అన్నారు. మంగళవారం మన ఊరు-మన బడి కింద ఎంపికైనా గుండ్లపల్లి, నాంసానిపల్లి, పొత్కపల్లిలో రెండు పాఠశాలలు, ఇందుర్తి, కొమిర ప్రాథమికోన్నత పాఠశాలలను డీఈవో సందర్శించారు. అలాగే పొత్కపల్లి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాభ్యాసానికి, ఉన్నత దశకు చేరేందుకు పదో తరగతి అతిముఖ్య మైనదన్నారు. లక్ష్యం లేకుండా చదివితే ప్రయోజనం ఉండదని, ఇష్టంతో చదవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి పాఠశాల తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావా లని, అలాంటి విద్యార్థులకే భవిష్యత్‌ ఉంటుందన్నారు. అలాగే మన ఊరు-మన బడి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రాజయ్య, పీఆర్‌ ఏఈ సమ్మిరెడ్డి, సర్పంచ్‌లు పులుగు తిరుపతిరెడ్డి, అంబాల సంధ్యారాణి, శ్రీనివాస్‌, పోతు గంటి రమ రాజు, తదితర సర్పంచ్‌లు , ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:43:09+05:30 IST