పారదర్శకంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ ఎంపిక

ABN , First Publish Date - 2022-12-06T00:20:23+05:30 IST

ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ ఎంపిక పార దర్శ కంగా ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనరాయణ అన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు.

పారదర్శకంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ ఎంపిక
మాట్లాడుతున్న సీపీ వి సత్యనారాయణ

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 5: ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ ఎంపిక పార దర్శ కంగా ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనరాయణ అన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు నిర్ణీత సమయానికన్నా గంట ముందుగానే మైదానానికి రావాలని సూచించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ అభ్యర్థుల సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు మానేరు బైపాస్‌రోడ్‌లోని ఉజ్వలపార్క్‌ సమీపంలో కరీంనగర్‌లోని సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ)లో జరుగుతాయని చెప్పారు. అన్నిశాఖల అధికారు లు తమవంతు సహకారాన్ని అందిస్తూ ఈ ఎంపిక విధానాన్ని విజయ వంతం చేయాలన్నారు. సమావేశంలో డీసీపీ ఎస్‌ శ్రీనివాస్‌, అడిషనల్‌ డీసీపీ చంద్రమోహన్‌, ఏసీపీలు తుల శ్రీనివాస్‌, టి కరుణాకర్‌రావు, జి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫ పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ సమక్షంలో పోలీసు అధికా రులు సోమవారం వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలను విధానాన్ని డెమోగా పరిశీలించారు. ఒక్కో అంశా నికి సంబంధించిన సమయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ జి వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు కిరణ్‌కుమార్‌, మురళి, సురేష్‌కుమార్‌, జానిమియా పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T00:20:26+05:30 IST