సహకార ఉద్యోగులకు భద్రత

ABN , First Publish Date - 2022-12-30T01:14:30+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పని చేస్తున్న వారికి ఉద్యోగాలపై ప్రభుత్వం భరోసా కల్పించింది. హెచ్‌ఆర్‌ పాలసీ తీసుకరావడంతోపాటు పాలకవర్గాల చైర్మన్లకు సంఘ లావాదేవీలను బట్టి గౌరవ వేతనాలను పెంచడంతో వారికి మరింత బా ధ్యత పెరిగింది.

సహకార ఉద్యోగులకు భద్రత

- కేటగిరీల వారీగా సంఘాల విభజన, సిబ్బంది కేటాయింపు

- పెరగనున్న ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు

- చైర్మన్లకు పెరగనున్న గౌరవ వేతనాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పని చేస్తున్న వారికి ఉద్యోగాలపై ప్రభుత్వం భరోసా కల్పించింది. హెచ్‌ఆర్‌ పాలసీ తీసుకరావడంతోపాటు పాలకవర్గాల చైర్మన్లకు సంఘ లావాదేవీలను బట్టి గౌరవ వేతనాలను పెంచడంతో వారికి మరింత బా ధ్యత పెరిగింది. దీంతో రైతాంగానికి గతంలో కంటే మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడను న్నది. హెచ్‌ఆర్‌ పాలసీతో ఉద్యోగులు, సిబ్బంది వేత నాలు పెరగడంతో పాటు చైర్మన్ల గౌరవ వేత నాలు కూడా పెరగనున్నాయి. కేటగిరీల వారీగా సంఘా లను విభజించి ఉద్యోగుల సంఖ్యను కూడా కేటా యించారు. జిల్లాలోని పెద్దపల్లి, అప్పన్నపేట, సుల్తా నాబాద్‌, చిన్నకల్వల, కనుకుల, సుద్దాల, గర్రెపల్లి, ఎలిగేడు, ధూలికట్ట, జూలపల్లి, నందిమేడారం, పత్తి పాక, కాల్వశ్రీరాంపూర్‌, కూనారం, పొత్కపల్లి, ముత్తారం, మంథని, కమాన్‌పూర్‌, కన్నాల, మేడిప ల్లిలో మొత్తం 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల నిర్వహణకు ఒక సీఈవో, ఆ సంఘం లావాదేవీలను బట్టి సిబ్బందిని నియమించుకుని వేతనాలు ఇస్తూ నడి పిస్తున్నారు. ఈ సంఘాల ద్వారా రైతులకు కావా ల్సిన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహార మందులు విక్రయించడంతో పాటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్ని సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్‌ పంపులు, ఇతరత్రా వ్యాపారా లను కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు సం ఘాల చైర్మన్లకు గౌరవ వేతనంగా నెలకు 1250 రూపాయలు ఇస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతి నిధులకు ఇస్తున్నట్లుగా తమకు కూడా వేతనాలు ఇవ్వాలంటూ ఆరేళ్లుగా సహకార సంఘాల చైర్మన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. సంఘం లావాదేవీలను బట్టి వారికి వేతనాలు ఇచ్చుకుంటూపోతున్నారు. వారికి ఎలాం టి సెలవులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న విధంగా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా పోయా యి. కనీసం బీమా సౌకర్యం కూడా లేదు. తమకు ఉద్య్గోగ భద్రత కల్పించాలని ఈ సంఘాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఎట్టకేలకూ స్పందించిన ప్రభుత్వం సంఘాల పనితీరు, వాటి లావాదేవీలు అంశాలపై అధ్యయనం చేసిన ప్రభుత్వం ఉద్యోగులు, సిబ్బందికి హెచ్‌ఆర్‌ పాలసీ తీసుక వచ్చింది.

ఫ హెచ్‌ఆర్‌ పాలసీతో పెరగనున్న వేతనాలు..

ప్రభుత్వం తీసుకవచ్చిన హెచ్‌ఆర్‌ పాలసీతో ఉద్యోగులు, సిబ్బంది జీతాలు పెరగనున్నాయి. సెక్రెటరీ(సీఈవో)లుగా పనిచేస్తున్న వారికి ప్రస్తుతం 20 నుంచి 30 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలుతో వారికి కనీసం 6,975 నుంచి గరిష్టంగా 21,725 రూపాయల వరకు పేస్కేల్‌ను వర్తింపజేయనున్నారు. అలవెన్సులతో కలుపుకుని వేతనాలు ప్రస్తుతం ఉన్నవాటి కంటే బాగానే పెరగనున్నాయి. స్టాఫ్‌ అసిస్టెంట్లకు 6,740 నుంచి 19,110 రూపాయల వరకు పేస్కేల్‌ ఉంటుందని, సబ్‌ స్టాఫ్‌కు 6,550 నుంచి 15,070 రూపాయల వరకు పేస్కేల్‌ ఇవ్వనున్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ వల్ల స్టాఫ్‌ అసిస్టెంట్లు, సబ్‌స్టాఫ్‌ ఉద్యోగులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనున్నది. ప్రస్తుతం వారికి 8 నుంచి 12వేల వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. అంతేగాకుండా ఆయా సంఘాల లావాదేవీలను బట్టి నాలుగు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ వారీగా ఉద్యోగులు ఉండాలి. 15 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న సంఘాల్లో ఒక సెక్రెటరీ, నలుగు అసిస్టెంట్లు, ఇద్దరు సబ్‌ స్టాఫ్‌లు ఉండాలని పేర్కొన్నారు. 10 నుంచి 15 కోట్ల టర్నోవర్‌ ఉన్న సంఘాల్లో ఒక సెక్రెటరీ, ముగ్గురు అసిస్టెంట్లు, ఒకరు సబ్‌ స్టాఫ్‌ ఉండాలని, 5 నుంచి 10 కోట్ల టర్నోవర్‌ గల సంఘాల్లో ఒక సెక్రెటరీ, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక సబ్‌ స్టాఫ్‌ ఉండాలని, 5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న సంఘాల్లో ఒక సెక్రెటరీ, ఒక అసిస్టెంట్‌, ఒక సబ్‌ స్టాఫ్‌ ఉండే విధంగా చూడాలని జీవోలో పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ పాలసీని 2019 మార్చి 31వ తేదీకి ముందు నియమితులైన వారికి మాత్రమే వర్తింపజేయాలని పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ వల్ల ఉద్యోగులను ఇతర సంఘాలకు బదిలీ చేసే వెసులుబాటు ఉంటుంది. ఎక్కడైతే ఆయా కేటగిరీలో ఉండాల్సిన ఉద్యోగుల కంటే ఎక్కువ మంది ఉంటే అలాంటి వారిని ఇతర సంఘాలకు బదిలీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.

ఫ చైర్మన్లకు కనీసం రూ. 5 వేల గౌరవ వేతనం..

సహకార సంఘాల చైర్మన్లకు ఇప్పటి వరకు 1250 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇవ్వ గా, ఇక నుంచి 5 వేల నుంచి మొదలుకుని 15 వేల వరకు ఇవ్వనున్నారు. 25 కోట్లకు పైగా టర్నోవర్‌ గల సంఘాల చైర్మన్లకు నెలకు 15 వేల రూపా యలు, 15 నుంచి 25 కోట్ల వరకు టర్నోవర్‌ గల సంఘాలకు 12,500 రూపాయలు, 10 నుంచి 15 కోట్ల వరకు టర్నోవర్‌ గల సంఘాలకు 10 వేల రూ పాయలు, 5 నుంచి 10 కోట్ల వరకు టర్నోవర్‌ గల సంఘాలకు 7,500 రూపాయలు, 5వేల కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న సంఘాలకు 5వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. ఈ పాలసీతో ఉద్యోగులు, గౌరవ వేతనా ల పెంపుతో చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-30T01:14:34+05:30 IST