సైన్స్‌ను విశ్వసించాలి
ABN , First Publish Date - 2022-12-10T23:20:44+05:30 IST
ప్రపంచాన్ని భయపెట్టిన కరోనాను అంతం చేసిన సైన్స్‌ను విశ్వసించాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో శనివారం చెకుముకి సైన్స్‌సంబరాలలో భాగంగా రెండో రోజు ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించడానికి సైన్స్ కార్నివాల్‌ను నిర్వహించారు.
సిరిసిల్ల ఎడ్యుకేషన్, డిసెంబరు 10: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనాను అంతం చేసిన సైన్స్‌ను విశ్వసించాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో శనివారం చెకుముకి సైన్స్‌సంబరాలలో భాగంగా రెండో రోజు ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించడానికి సైన్స్ కార్నివాల్‌ను నిర్వహించారు. ఈ కార్నివాల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ వరకు ఏర్పాటు చేశారు. దీనిలో సైన్స్, మ్యాథ్స్, బయాలజీ తదితర 18 స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు వివరించారు. ఈ సం దర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలను పారదో లడానికి సైన్స్‌ను నమ్మాలని చెప్పారు. మూఢనమ్మకాలను విశ్వసించొద్దని అన్నారు. సైన్స్ అభివృద్ధి చెందిన దేశాలు ముందంజలో ఉన్నాయని, మన దేశం కూడా అదే వరుసలో ఉందన్నారు. మూఢనమ్మకాల నిర్మూలనకు 18 స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. మాయలు, మంత్రాలు ఏమీలేవని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఉన్నదంతా సైన్స్ అని అన్నారు, దయ్యాలు, భూతాలు, మంత్రాలు లాంటి వాటిని నమ్మకూడదని, వాటి వల్ల అనేక అనర్థాలు సంభవి స్తాయన్నారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయంగా జీవించాలని సూచించారు. అనంతరం కళ్లకు గంతలు కట్టి బైక్ రైడింగ్ చేయడం, మంటలు మిగడం, గాజుపెంకుల్లో నడవడం, ఇస్రో నుంచి వచ్చిన ప్రత్యేక బస్సులో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ప్రయోగ విధానాలు వీక్షకులను అలరించాయి. కార్యక్రమంలో అస్త్రానమి శాస్తవేత్త ప్రొఫెసర్ రుక్మిణి, నిమ్స్ మాజీ డైరెక్టర్ దాసరి ప్రసాద్‌రావు, ఇస్త్రో శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్, సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ రాధా, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సి రామరాజు, రాహుల్, డిఎస్పీ విశ్వప్రసాద్, జిల్లా అధ్యక్షులు గుర్రం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్, గౌరవ అధ్యక్షులు గంగరాజు, విద్యార్థులు, ఉపాధ్యా యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఫ శాస్త్రవేత్తలతో ముఖాముఖి...
చెకుముకి రాష్ట్రస్థాయి సైన్స్ సంబరాలలో భాగంగాఉదయం రంగినేని ట్రస్టులో శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓయూ ప్రొఫెసర్ సత్యప్రసాద్, అస్త్రానమి శాస్త్రవేత్త ప్రొఫెసర్ రుక్మిని, నిమ్స్ మాజీ డైరెక్టర్ దాసరి ప్రసాద్, ఇస్త్రో శాస్త్రవేత్త డాక్టర్ రాధా, ప్రొఫెసర్స్ లక్ష్మారెడ్డి, బియన్‌రెడ్డి, రామచంద్రయ్య, కోయ వెంకటేశ్వర్లతో విద్యార్థులకు ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేశారు.