కన్నుల పండువగా సాయిబాబా పుణ్యతిథి

ABN , First Publish Date - 2022-10-07T05:45:52+05:30 IST

కోరుట్ల షిరిడీ శ్రీసాయిబాబా దేవాలయంలో గురువారం 104వ పుణ్యతిథి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.

కన్నుల పండువగా సాయిబాబా పుణ్యతిథి
పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, ప్రజాప్రతినిదులు

కోరుట్ల, అక్టోబరు 6 : కోరుట్ల షిరిడీ శ్రీసాయిబాబా దేవాలయంలో గురువారం 104వ పుణ్యతిథి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వేల సంఖ్యలో జనం పుణ్యతిధి వేడుకలకు హాజరయ్యారు. ఉదయం 5 గంటల నుంచి కాగడ హారతి, ఆలయ సంకీర్తన, అభిషేకము, పతకారోహణ, గణపతిపూజ, కలుషాభిషేకం, విశ్వ కళ్యాణ యజ్ఞం, హోమంతోపాటు ప్రత్యేక పూజలను వేద పండితులు ఘనంగా ని ర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసా గర్‌ రావు, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్ల్‌ అన్నం అనిల్‌ - అనిల్‌, సుజాత - సత్యానారా యణ, డా. బోగ శ్రావణీ - ప్రవీణ్‌తో పాటు స్థానిక ప్రజప్ర తినిదులకు వేదపం డితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, కోరుట్ల, మె ట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్య, సుజాత, ఎంపీపీ తోట నారాయణ, వైస్‌ చైర్మెన్‌ గడ్డమీది పవన్‌ బాబా దర్శనం చేసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొ న్నారు. మహాఅన్నదాన కార్యాక్రమాన్ని ఎమ్మెలే దంపతులు ప్రారంభించారు. నిర్వాహ కు లు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకార్యార్థం యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల షిరిడి సాయి బాబా భక్త సమాజం చైర్మన్‌ చిద్రాల భూమయ్యలతో పాటు కమిటీ సభ్యులు, మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 

ఏలాంటి అవంచనీయ సంఘటన చోటు చేసుకుండా మెట్‌పల్లి డీఎస్పీ రవీం దర్‌రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు.  

కోరుట్ల రూరల్‌: కోరుట్ల మున్సిపల్‌ పరిధిలోని ఎఖీన్‌పూర్‌ గ్రామంలో గురు వారం సాయి పుణ్యతిథి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వ ర్యంలో అన్నదానం నిర్వహంచారు. మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ మోహ న్‌రెడ్డి, కౌన్సిలర్లు సుజాత - మురళిలతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. 

జగిత్యాల టౌన్‌: జిల్లా కేంద్రంలోని సాయిబాబా, గుట్ట రాజేశ్వర స్వామి ఆల యల్లో సాయిబాబా 105వ పుణ్యతిధి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత దంపతులు, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ చంద్రశేకర్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులు వేడుకల్లో పాలు పంచుకుని సాయిబాబా విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T05:45:52+05:30 IST