కుంకుమ పూజలు.. అక్షరాభ్యాసాలు

ABN , First Publish Date - 2022-10-03T07:20:24+05:30 IST

జిల్లావ్యాప్తంగా దేవి నవరాత్రో త్సవాలు కొనసాగుతున్నాయి.

కుంకుమ పూజలు.. అక్షరాభ్యాసాలు
ధర్మపురిలో కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారలు

ధర్మపురి, అక్టోబరు 2: జిల్లావ్యాప్తంగా దేవి నవరాత్రో త్సవాలు కొనసాగుతున్నాయి. ధర్మపురి  రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారలు కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.  అంతకుముందు స్థానిక లక్ష్మీనృసింహస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో ఆలయ వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీనరసింహస్వామి వార ల సేవలు సూర్యప్రభవాహనంపై ఊరేగింపు జరిపారు. టీటీడీ ధర్మశాల వద్ద అమ్మవారిని ఎల్‌ఎం కొప్పుల సోషల్‌ సర్వీస్‌ ఆర్గనేజన్‌ చైర్‌పర్సన్‌ కొప్పుల స్నేహలత దర్శనం చేసుకున్నారు. 


Read more