సిబ్బంది కృషితోనే ఆర్టీసీ లాభాల బాట

ABN , First Publish Date - 2022-11-24T23:54:20+05:30 IST

ఆర్టీసీ సిబ్బంది కృషితోనే సంస్థ లాభాల బాట పట్టిందని కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి వెంకటేశ్వర్లు అన్నారు.

సిబ్బంది కృషితోనే ఆర్టీసీ లాభాల బాట
ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడుతున్న ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వివెంకటేశ్వర్లు

భగత్‌నగర్‌, నవంబరు 24: ఆర్టీసీ సిబ్బంది కృషితోనే సంస్థ లాభాల బాట పట్టిందని కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి వెంకటేశ్వర్లు అన్నారు. కరీంనగర్‌-2 ఉద్యోగులతో రీజినల్‌ మేనేజర్‌ ఖుస్రోషాఖాన్‌తో కలిసి గురువారం ఆయన గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ ఆర్థిక పరిస్థితిని, ఉద్యోగుల కోసం చేపడుతున్న వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తు సంస్థ ప్రతిష్టను పెంచాలన్నారు. యూనియన్‌ బ్యాంకు ద్వారా ప్రతి ఉద్యోగికి బీమా కల్పించామన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ వి మల్లయ్య, నాగభూషణం, పుల్లయ్య, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం రీజినల్‌ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Updated Date - 2022-11-24T23:54:20+05:30 IST

Read more