ఆర్టీసీ బస్సులను పరిశుభ్రంగా ఉంచాలి

ABN , First Publish Date - 2022-11-30T00:21:22+05:30 IST

బస్సులను పరిశుభ్రం గా ఉంచి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిం చాలని ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు సూచించారు.

ఆర్టీసీ బస్సులను పరిశుభ్రంగా ఉంచాలి

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 29: బస్సులను పరిశుభ్రం గా ఉంచి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిం చాలని ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం గోదావరిఖని ఆర్టీసీ డిపో లో రూ.6లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమెటిక్‌ వాషింగ్‌ యంత్రాన్ని ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణి కులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని, బస్సులను ఎళ్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ యంత్రంతో బస్సులను కడగడానికి ఎంతో ఉప యోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఓ ఖుప్రోష్‌ఖాన్‌, డివిజనల్‌ మేనేజర్‌ కవిత, ఆర్‌టీసీ డీఎం మల్లేశం, ఇంజనీర్‌ వైవీరావు, అసిస్టెంట్‌ మేనేజర్లు రవి కుమార్‌, వీరస్వామి పాల్గొన్నారు.

ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రశంసాపత్రాలు

గోదావరిఖని ఆర్టీసీ డిపోలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డైవర్లకు, కండక్టర్లకు డిపో ఆవరణలో మంగళవారం కరీంనగర్‌ జో నల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు ప్రశంసా పత్రాలను అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపోకు అత్యధిక ఆదాయంతో పాటు మైలేజీ అధికంగా తీసుకువచ్చిన డ్రైవర్లను ఆయన అభినందించారు. ఇదే కృషితో పనిచేస్తే ఆర్‌టీసీకి మరిన్ని లాభాలు తీసుకువచ్చారన్నారు. ఆర్‌ఎం ఖుప్రోష్‌ఖాన్‌, డివిజనల్‌ మేనేజర్‌ కవిత, ఆర్‌టీసీ డీఎం మల్లేశం, ఇంజనీర్‌ వైవీరావు, అసి స్టెంట్‌ మేనేజర్లు రవికుమార్‌, వీరస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:21:26+05:30 IST