మర్రిచెట్టుకు రీప్లాంటేషన్‌

ABN , First Publish Date - 2022-12-30T23:45:28+05:30 IST

గోదావరిఖని ఫైవింక్లయిన్‌చౌరస్తాలో జంక్షన్‌ విస్తరణ సందర్భంగా రోడ్డు మధ్యలో ఉన్న 30ఏళ్ల నాటి మర్రి చెట్టుకు శుక్రవారం 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొడ్డు రజితరవీందర్‌ రీ ప్లాంటేషన్‌ చేయించారు.

మర్రిచెట్టుకు రీప్లాంటేషన్‌
మర్రి చెట్టును రీప్లాంటేషన్‌ చేస్తున్న కార్పొరేటర్‌ రజితరవీందర్‌

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 30: గోదావరిఖని ఫైవింక్లయిన్‌చౌరస్తాలో జంక్షన్‌ విస్తరణ సందర్భంగా రోడ్డు మధ్యలో ఉన్న 30ఏళ్ల నాటి మర్రి చెట్టుకు శుక్రవారం 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొడ్డు రజితరవీందర్‌ రీ ప్లాంటేషన్‌ చేయించారు. పట్టణ సుందరీక రణలో భాగంగా ఫైవింక్లయిన్‌ చౌరస్తాలో ఉన్న మర్రి చెట్టును కాంట్రాక్టర్‌ మొండయ్య సహాయంతో మర్రి చెట్టును తరలించి కొత్తరోడ్డులోని సబ్‌ స్టేషన్‌ ముందు రీ ప్లాంటేషన్‌ చేశారు. ఈ సం దర్భంగా కార్పొరేటర్‌ రజిత మాట్లాడుతూ గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, విజయ్‌, కుమార్‌, బుర్రి వెంకటి, శివ, లక్ష్మణ్‌, ఓదెలు, రాయమల్లు, రాంరెడ్డి, ముత్తు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:45:30+05:30 IST