‘రైతు బంధు’కు రెడీ
ABN , First Publish Date - 2022-12-25T00:53:16+05:30 IST
యాసంగి పెట్టుబడికి రైతు బంధు సాయాన్ని అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
- జిల్లాలో 2,31,151 రైతులతో జాబితా
- కొత్తగా 6,468 మంది అన్నదాతలకు సైతం
జగిత్యాల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): యాసంగి పెట్టుబడికి రైతు బంధు సాయాన్ని అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రానున్న మూడు నాలుగు రోజుల నుంచి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార యంత్రాంగం కసరత్తులు పూర్తి చేస్తోం ది. వానాకాలం, యాసంగి పంటలకు ఎకరానికి రూ. 5 వేలు చొప్పున ఏ డాదికి రూ. 10 వేలు అందజేస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు వ్యవ సాయ శాఖ అధికారుల వద్దకు వివరాల ప్రకారం అధికారులు రైతు బం ధుకు అర్హులైన అన్నదాతల జాబితాను రూపొందించారు.
ఖరారైన రైతుల తుది జాబితా..
జిల్లాలో అర్హులైన రైతుల తుది జాబితాను రూపొందించారు. పట్టాదా రు పాసు పుస్తకం పొంది సీసీఎల్‌ఏ ద్వారా ధరణి పోర్టల్‌లో చేర్చబడి వారి ఖాతాల్లో రైతు బంధు సాయం జమ చేయనున్నారు. సాగు భూ ములను రెండు రకాలుగా విభజించి ఎలాంటి సమస్యలు లేని వాటిని పార్ట్ - ఏలో చేర్చి వీరికి పాసు పుస్తకాలు అందజేశారు. ఇవి ఇనామ్, వంశపారపర్యంగా, కోర్టులో పరిష్కారంలో ఉన్న వాటిని గుర్తించారు. ఇం దులో ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్న వాటిని పరిగణలోకి తీసుకొ ని పట్టా పాసు పుస్తకాలను అందజేస్తున్నారు. దీంతో ప్రతీ యేటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. గత వానాకాలంతో పోలిస్తే ఈ సారి 6,468 మంది రైతులకు అదనంగా సాయం అందనుంది. మొదటి విడత గా ఎకరంలోపు భూమి ఉన్న వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తదుపరి విడతల వారిగా రెండు, మూడు, అయిదు ఎకరాల్లోపు, మరో విడతలో దశల వారిగా మిగితా వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
జోరందుకుంటున్న యాసంగి పనులు..
జిల్లాలో వానాకాలం పనులు పూర్తయ్యాయి. ధాన్యం మార్కెట్‌కు తర లించి రైతులు విక్రయించారు. పలువురు రైతుల్లో ధాన్యం డబ్బులను సై తం ప్రభుత్వం జమచేసింది. రైతులు యాసంగి పనులపై దృష్టి సా రించారు. ఆయకట్టు ప్రాంతం, నీటి సౌకర్యం ఉన్న రైతులు నార్లు పోసు కోవడం, పలు ప్రాంతాల్లో నాట్లు వేయడం సైతం జరుగుతోంది. ఎస్సా రెస్పీ కాకతీయ కాలువకు, వరద కాలువకు అధికారులు నీటిని సైతం విడుదల చేశారు.
జిల్లాలో రైతు బంధుకు అర్హులైన వివరాలు ఇలా..
జిల్లాలో సుమారు 3.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నా యి. గత వానాకాలంలో 2,23,917 మంది రైతులకు రూ. 212.65 కోట్లు రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం జిల్లాలో మొ త్తం పట్టాదారుల సంఖ్య 2,31,151గా ఉంది. జిల్లాలో ప్రస్తుత యాసం గిలో కొత్త పట్టాదారులు, కొత్త పాసు పుస్తకాలు పొందిన 6,468 మంది రైతులున్నారు. కాగా పాత పట్టాదారుల్లో 766 మంది బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉన్నట్లుగా గుర్తించారు. జిల్లాలో ప్రస్తుత యాసంగిలో అదనంగా పెరిగిన రైతుల సంఖ్య 6,468గా ఉంది. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ లో సుమారు రూ. 230 కోట్ల రైతు బంధు సాయం అందించనున్నారు.
రైతుబంధుకు సిద్ధం చేశాం
- సురేశ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా అర్హల కలిగిన వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మొదటి విడతగా ఎకరం లోపు ఉన్న రైతులకు జమకానుంది. రైతు బంధుకు అర్హులైన అన్నదాతల జాబితాను రూపొందించాము. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతుబంధును ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.