రంగదామునిపల్లె వాసికి డాక్టరేట్‌

ABN , First Publish Date - 2022-10-03T07:24:44+05:30 IST

గొల్లపల్లి మండలం రంగదాముని పల్లె గ్రామానికి చెందిన గుంటుకుల రాజు తన ప్రతిభా పాటవాలతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌ కేంద్రియ విశ్వ విద్యాలయం నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టాను అందుకు న్నారు.

రంగదామునిపల్లె వాసికి డాక్టరేట్‌
కేంద్ర మంత్రి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకుంటున్న రాజు

గొల్లపల్లి, ఆక్టోబరు 2: గొల్లపల్లి మండలం రంగదాముని పల్లె గ్రామానికి చెందిన గుంటుకుల రాజు తన ప్రతిభా పాటవాలతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌ కేంద్రియ విశ్వ విద్యాలయం నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టాను అందుకు న్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాల యం 22వ స్నాతకోత్సవం సందర్భంగా శనివారం జరిగిన ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌, విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌, గవర్నర్‌ తమిళసై సౌందర్యరా జన్‌, వైస్‌ఛాన్సలర్‌ నర్సింహారెడ్డి చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టాను స్వీకరించారు. ‘వాతావరణంలో మార్పులు.. వ్యవ సాయం మీద దాని ప్రభావం’ అనే అంశంపై చేసిన పరిశో ధనకు గాను రాజు పీహెచ్‌డీ డాక్టరేట్‌ సాధించాడు.


Read more