రామగుండం మెడికల్‌ కళాశాలకు సింగరేణి పేరు పెట్టాలి

ABN , First Publish Date - 2022-11-19T00:17:48+05:30 IST

గోదావరిఖని డిగ్రీ కళా శాలలో నూతనంగా నిర్మించిన మెడికల్‌ కళాశాలకు సింగరేణి మెడికల్‌ కళాశాలగా నామకరణం చేయాలని సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్‌ డిమాండ్‌ చేశారు.

రామగుండం మెడికల్‌ కళాశాలకు సింగరేణి పేరు పెట్టాలి

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 18: గోదావరిఖని డిగ్రీ కళా శాలలో నూతనంగా నిర్మించిన మెడికల్‌ కళాశాలకు సింగరేణి మెడికల్‌ కళాశాలగా నామకరణం చేయాలని సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఫైవింక్ల యిన్‌లోని సింగరేణి కార్మిక విగ్రహానికి సీపీఐ ఆధ్వర్యం లో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్‌ కళాశాల సాధనలో ఎమ్మెల్యే పాత్ర ఏమిలేదన్నారు. ఇది కేవలం ఈప్రాంత ప్రజలు, సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అనేక సార్లు నిరస నలు, ధర్నాలు, ఉద్యమాలు చేసిన నేపథ్యంలో మెడికల్‌ కళా శాలను ప్రకటించారన్నారు. అది కూడా సింగరేణి సంస్థ నిధులతోనేనన్నారు. తాను మెడికల్‌ కళాశాలను తీసు కువచ్చానంటూ ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి సం స్థకు లాభాలు తీసుకువస్తే అందులో రూ.500కోట్లు మెడికల్‌ కళాశా లకు ఇచ్చారని, ఇందులో ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే చందర్‌ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. సింగరేణి యాజ మాన్యం ఇచ్చిన నిధులతో నిర్మించిన మెడికల్‌ కళాశాలలో కార్మికుల పిల్లలకు అధిక శాతం సీట్లు కేటాయించి మొదటి ప్రాధాన్యం వారికే ఇవ్వాలన్నారు. మెడికల్‌ కళాశాలపై ప్రేమ కాదని, కళాశాల నిర్మా ణం చేస్తున్న కాంట్రాక్టర్లపై ప్రేమ ఉందన్నారు. నూతనంగా నిర్మా ణం అయిన కాలేజీలో కాంట్రాక్టు ఉద్యోగాలను కూడా స్థానికేతరుల కు కట్టబెట్టారని, అందులోకూడా డబ్బులు తీసుకుని పనులు పెట్టిం చారని ఆరోపించారు. ఇప్పటికైనా కళాశాల, ప్రభుత్వాసుపత్రి నిర్వ హణకు ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే నిధులు తీసుకువచ్చి నిర్మించు కోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు గౌతం గోవర్ధన్‌, గోషిక మోహన్‌, తాళ్లపల్లి మల్లయ్య, తొడుపునూరి రమేష్‌, మార్కపురి సూర్య, సంకె అశోక్‌, రేణికుంట్ల ప్రీతం, శనిగర పు చంద్రశేఖర్‌, అబ్దుల్‌ కరీం, వనపాకల విజయ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:17:53+05:30 IST