రాజన్న క్షేత్రం భక్తజన సంద్రం

ABN , First Publish Date - 2022-06-07T06:02:49+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భరీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

రాజన్న క్షేత్రం భక్తజన సంద్రం
భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం

- క్రిక్కిరిసిన వేములవాడ 

- 30 వేల మందికి  పైగా భక్తుల రాక

వేములవాడ, జూన్‌ 6 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం సోమవారం   భక్తజన సంద్రంగా మారింది. తమ ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భరీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.   పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో కోడెమొక్కులు చెల్లించుకునేందుకు మూడు నుంచి నాలుగు గంటలు,  స్వామివారి దర్శనానికి రెండు నుంచి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు  ఏర్పాట్లు చేశారు. సిఫారసు లేఖలతో వచ్చిన వారితో పీఆర్‌వో కార్యాలయం కిక్కిరిసిపోయింది. సోమవారం సుమారు 30 వేల మందికి పైౖగా భక్తులు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని,  దాదాపు 25 లక్షల మేరకు ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయం భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. 

Read more