అభివృద్ధిలో జగిత్యాలకు ధీటుగా రాయికల్‌

ABN , First Publish Date - 2022-11-23T00:23:56+05:30 IST

రాయికల్‌ మేజర్‌ గ్రామపంచాయతీని ము న్సిపాలిటీగా మార్చి జిల్లా కేంద్రానికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

అభివృద్ధిలో జగిత్యాలకు ధీటుగా రాయికల్‌
దుకాణ సముదాయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

రాయికల్‌, నవంబరు 22: రాయికల్‌ మేజర్‌ గ్రామపంచాయతీని ము న్సిపాలిటీగా మార్చి జిల్లా కేంద్రానికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం స్థానిక హను మాన్‌దేవాయలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దేవాల యల ఆవరణలో టీయుఎఫ్‌ఐడీసీ నిధులు రూ.59 లక్షలతో నిర్మించిన దు కాణ సముదాయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ రాయికల్‌ను మున్సిపల్‌గా మార్చి అభివృద్ధికి రూ. 25కోట్లు మంజూరు చేశామని నేడు రాయికల్‌ అభివృద్ధి కళ్లకు కనిపిస్తుందని అ న్నారు. అనంతరం పట్టణానికి చెందిన 16మంది లబ్దిదారులకు సీఎం ఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ.5లక్షల27వేల విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి, ఆలయ చైర్మన్‌ ఎలగందుల సత్యనారాయణ, సింగిల్‌విండో చైర్మన్‌ ఏనుగు మల్లారెడ్డి, కమీషనర్‌ సం తోష్‌కుమార్‌, కౌన్సిలర్లుశ్రీధర్‌రెడ్డి, సువర్ణ సత్యనారాయణ, కాంతారావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎలగందుల ఉదయశ్రీ లింగంగౌడ్‌, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజోల్లోకి తీసుకువె ళ్లాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పార్టీ కార్యకర్తలకు సూచించా రు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చేరువకావాలని దిశానిర్ధేశం చేశారు.

Updated Date - 2022-11-23T00:23:58+05:30 IST