రాహుల్‌ యాత్రను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-17T05:39:46+05:30 IST

దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్‌గాంధీ చేప ట్టిన యాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పిలుపునిచ్చారు.

రాహుల్‌ యాత్రను విజయవంతం చేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఈర్ల కొమురయ్య

- డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య

పెద్దపల్లిటౌన్‌ అక్టోబరు 16 : దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్‌గాంధీ చేప ట్టిన యాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పిలుపునిచ్చారు. ఈసందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరు ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మతతత్వ పార్టీల నిరంకుశ పాలన, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాహుల్‌గాంధీ యాత్ర చేపట్టారన్నా రు. సోమవారం అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ కమిటీ అధ్యక్ష పదవికి గాంధీ భవ న్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమలంలో సెగ్గెం రాజేష్‌, తోట చంద్రయ్య, బాలాజీ, రాజయ్య, విజయ్‌కుమార్‌, మద్దెల రాజయ్య, వేముల రాజు, ఇందారపు అనీల్‌, కొంత శ్రీనివాస్‌, ఉడుత శంకర్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T05:39:46+05:30 IST