సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-12-31T23:47:01+05:30 IST

సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాధవి అన్నారు.

సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సమావేశంలో చైర్‌పర్సన్‌, కమిషనర్‌

వేములవాడ టౌన్‌, డిసెంబరు 31: సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాధవి అన్నారు. వేములవాడ మున్సిపల్‌ కార్యాలంయంలోని సమావేశ మందిరంలో శనివారం మున్సిపల్‌ సాఽధారణ సమావేశాన్ని నిర్వహించారు. చైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాధవి, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయ వార్డుల్లోని సమస్యలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకొచ్చారు. వార్డుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని, వార్డుల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్‌ చల్లాలని, వార్డుల్లో దోమల నివారణకు ఫాగింగ్‌ వాడకాన్ని పెంచాలని వివరించారు. కౌన్సిలర్లు తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను చైర్‌పర్సన్‌ ఆదేశించారు. పట్టణంలో పురోగతిలో ఉన్న పనులపై చర్చించారు. సమావేశంలో భాగం గా 25 ఎజెండా అంశాలపై చర్చిం చినట్లు, ఏక గ్రీవ తీర్మానం చేసినట్లు పాలకవర్గం సభ్యులు తెలిపారు.

ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డులపై వివక్ష

తమ వార్డుల్లో అభివృద్ధిపై వివక్ష చూపు తున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశా రు. 20వ వార్డు అంబేద్కర్‌నగర్‌, ముదిరాజ్‌ వీధిలో సంవత్సర కాలంగా సిమెంట్‌ రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నాయని, పూర్తి చే యకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు. సమస్యల పరి ష్కారం కోసం ఏర్పాటు చేసే మున్సిపల్‌ సాధరణ సమావేశం కేవలం బిల్లులు చెల్లింపుల కోసం నిర్వహించడం అలవాటుగా మారిందన్నారు. కౌన్సిలర్లు లావణ్య శ్రీనివాస్‌, అన్నారం ఉమా శ్రీనివాస్‌, సంతోష్‌బాబు, సునంద శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-31T23:47:07+05:30 IST