పోలీస్‌ స్నైపర్‌ డాగ్‌ మృతి

ABN , First Publish Date - 2022-11-17T00:08:15+05:30 IST

పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ స్నైపర్‌ డాగ్‌ (టైసన్‌) మంగళవారం అనారోగ్యంతో మరణించింది. కమిషనరేట్‌ కేంద్రంలో పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణతోపాటు జిల్లాలోని పోలీసు అధికారులు పోలీస్‌డాగ్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

పోలీస్‌ స్నైపర్‌ డాగ్‌ మృతి
పోలీస్‌ జాగిలం మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న సీపీ వి సత్యనారాయణ

కరీంనగర్‌ క్రైం, నవంబరు 16: పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ స్నైపర్‌ డాగ్‌ (టైసన్‌) మంగళవారం అనారోగ్యంతో మరణించింది. కమిషనరేట్‌ కేంద్రంలో పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణతోపాటు జిల్లాలోని పోలీసు అధికారులు పోలీస్‌డాగ్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. 2015 నుంచి ఈ పోలీస్‌డాగ్‌ కమిషనరేట్‌లో సేవలు అందిస్తున్నది. పోలీస్‌ డాగ్‌కు మానేరు జలాశయం తీరంలో బుధవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో సీపీతోపాటు అడిషనల్‌ డీసీపీలు ఎస్‌ శ్రీనివాస్‌, జి చంద్రమోహన్‌, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఆర్‌ఐలు కిరణ్‌కుమార్‌, రమేష్‌, మల్లేశం, సురేష్‌, పశు వైద్య అధికారి నరేష్‌రెడ్డి, ట్రైనర్‌ రాజు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:08:15+05:30 IST

Read more