సీఎం ఆదేశాలతోనే పోలీసుల సోదాలు

ABN , First Publish Date - 2022-12-15T00:10:39+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే పోలీసుల హైదారాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ ఆఫీసులో సోదాలు జరిపారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

సీఎం ఆదేశాలతోనే పోలీసుల సోదాలు
సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు-(52జెజిటి14)

సీఎం ఆదేశాలతోనే పోలీసుల సోదాలు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 14 : సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే పోలీసుల హైదారాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ ఆఫీసులో సోదాలు జరిపారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోదాలను వ్యతిరేకిస్తూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. ఇందిరాభవన్‌ నుంచి తహసీల్‌ చౌరస్తా వరకు కాంగ్రెస్‌ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు పొంది పార్టీ కార్యకలాపాలు నిర్వహించే కాంగ్రెస్‌ కార్యాలయంపై పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేసి విలువైన కంప్యూటర్‌, ల్యాప్‌ ట్యాప్‌లను సీజ్‌ చేయడం, ముగ్గురిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందనే అక్కసుతో పార్టీని అణగదొక్కడానికే బీఆర్‌ఎస్‌ కుట్రలు పన్నుతుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మన్సూర్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మధు, ఫ్లోర్‌ లీడర్‌ దుర్గయ్య, నాయకులు గాజుల రాజేందర్‌, రమేష్‌ బాబు, చాంద్‌ పాష, మున్నా, నేహాల్‌, మహిపాల్‌, రజనీ కాంత్‌, రాజేష్‌, విజయ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-15T00:11:57+05:30 IST