వీక్లీ పరేడ్‌లతో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌

ABN , First Publish Date - 2022-10-02T05:43:55+05:30 IST

వీక్లి పరేడ్‌ వల్ల సిబ్బందికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ తోపాటు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని రామగుండం పోలీస్‌ కమి షనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

వీక్లీ పరేడ్‌లతో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌
సిబ్బందికి సూచనలు ఇస్తున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, అక్టోబరు 1: వీక్లి పరేడ్‌ వల్ల సిబ్బందికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ తోపాటు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని రామగుండం పోలీస్‌ కమి షనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం కమిషనరేట్‌లోని పరేడ్‌ మైదానంలో సిబ్బందికి వీక్లి పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం దొరికినప్పుడు సిబ్బంది వ్యాయా మం చేయడం ముఖ్యమన్నారు. అనునిత్యం ఫిట్‌నెస్‌ను కాపాడుకోవా లన్నారు. వీక్లీ పరేడ్‌లో ఏమైనా సమస్యలుంటే పైఅధికారులకు చెప్పు కునే అవకాశం ఉంటుందని, దీనిని సిబ్బంది వినియోగించుకోవాల న్నారు. పోలీసులు మంచి జీవనవిధానాన్ని అలవర్చుకోవాలన్నారు. సి బ్బందికి విధుల్లో, వ్యక్తిగతంగా, ఆరోగ్య సమస్యలుంటే ఉన్నతాధికారు ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటుపడి విధుల్లో క్రమశిక్షణ లేకుండా నిర్లక్ష్యం వహి స్తే ఊపేక్షించేది లేదన్నారు. రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకో వాలని సూచించారు. ఈ పరేడ్‌లో పెద్దపల్లి డీసీపీ రూపేష్‌, ఏసీపీ గిరి ప్రసాద్‌, ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు, ఏఆర్‌ఏసీపీ సుందర్‌రావు, గోదావరిఖ ని ఇన్సెపెక్టర్లు రమేష్‌బాబు, ప్రసాద్‌రావు, టూటౌన్‌ సీఐలు వేణుగోపాల్‌, అబ్జలుద్దిన్‌,రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమా ర్‌, ఆర్‌ఐలు మధుకర్‌, విష్ణుప్రసాద్‌, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more