‘కంటి వెలుగు-2’ లో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలి
ABN , First Publish Date - 2022-12-07T00:07:51+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రారం భించనున్న కంటి వెలుగు-2 కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీల కమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
జగిత్యాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రారం భించనున్న కంటి వెలుగు-2 కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీల కమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగ ళ వారం జగిత్యాల పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జి ల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఈసందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణలో దృ ష్టిలోపాలను సవరించేందుకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపక ల్పన చేశారన్నారు. రాష్ట్రంలో వచ్చే నెల 18వ తేది నుంచి కంటి వెలుగు - 2కార్య క్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ప్రతీ జిల్లాలో మైక్రో ప్లానింగ్ పూర్తయిన త దుపరి జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా వారిగా మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో కంటి వెలుగు-2 కార్యక్రమం కింద సుమా రు 3 కోట్ల మందిని స్ర్కీన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రపంచం లోనే అతి పెద్ద కమ్యూనిటీ స్ర్కీనింగ్ కంటి వెలుగు అని అన్నారు. రెండో విడత కంటి వెలుగులో మొదటి విడత కంటే వైద్య బృందాలను పెంచామని, రాష్ట్రంలో 1,500 టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. రూ. 200 కోట్ల నిధులను కంటి వెలు గు కార్యక్రమం కోసం ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. హైద్రా బాద్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి హాజరయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద పాల్గొన్నారు.