స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-06-05T05:52:13+05:30 IST

స్వచ్ఛ తెలంగాణ ధ్యేయంగా పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు.

స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలి
సిరిసిల్ల, వేములవాడలో మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్స్‌ జిందం కళ

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 4: స్వచ్ఛ తెలంగాణ ధ్యేయంగా పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం 3, 6వ వార్డులో 4వ పట్టణ ప్రగతి కార్యక్రమాలను చైర్‌ పర్సన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ వార్డులో పట్టణ ప్రగతి విజయవంతం చేయడంలో ప్రతీ ఒక్కరు బాగస్వాములు కావాలన్నారు. పట్టణ ప్రగతి ద్వారా సిరిసిల్ల పట్టణం వందశాతం స్వచ్ఛతను సాధించాల న్నారు. తడి, పొడి, హానికరమైన చెత్తను విభజించి చెత్త సేకరణ వాహనాలకు అందించాలన్నారు. ఎవరైనా చెత్తను బయట వేస్తే జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్‌ గుండ్లపెల్లి రామానుజం,  శివసాయిబాబా దేవాలయం అధ్యక్షుడు మామిడాల కృష్ణ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షు డు జిందం చక్రపాణి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ దూస భూమయ్య, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. 

ఫ వేములవాడ: వేములవాడ పట్టణంలోని 18వ వార్డులో శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, స్థానిక వార్డు కౌన్సిలర్‌ కొండ పావని, వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి ఎద్దడి, పారిశుధ్య సమస్య వంటి తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ సంపత్‌, వార్డు అధికారి నర్సయ్య, కోఆప్షన్‌ సభ్యుడు బాబున్‌, నాయకులు కొండ నర్సయ్య, రామతీర్థపు రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-05T05:52:13+05:30 IST