అర్హులైన వారందరికీ పింఛన్లు అందించాలి
ABN , First Publish Date - 2022-08-18T06:07:43+05:30 IST
ధర్మపురి నియోజకవర్గంలో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు అందజేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, ఆగస్టు 17: ధర్మపురి నియోజకవర్గంలో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు అందజేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ధర్మపురి పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవ ర్గంలో అర్హులందరికీ పింఛన్ల మంజూరు కోసం సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కలెక్టర్‌తో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గంలో అర్హుల జాబితాను తయారు చేయాలన్నారు. జిల్లాలో, నియోజకవర్గంలో నేటి వరకు వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, గీతాకార్మికుల పెన్షన్లకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. వరద బాధితులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింద ని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం కొంత మంది బాధితులకు మాత్రమే పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 3200 రూపాయలు, పూర్తి స్థాయిలో దెబ్బతిన్న ఇళ్లకు 5200 రూపాయలు అందించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల వల్ల నష్టపోయిన వారందరికి వెంటనే ఆర్థికసాయం అందించా లని ఆయన కోరారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంగనభట్ల దినేష్, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంట సుధాకర్, జిల్లా కార్యద ర్శి కస్తూరి శ్రీనివాస్, చిలుముల లక్ష్మణ్, నియోజకవర్గ యువజన కాంగ్రె స్ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల అధ్యక్షు డు రాందేని మొగిలి, మాజీ ఎంపీటీసీ సీపతి సత్యనారాయణ, మైనార్టీ అధ్యక్షు డు ఎండీ రఫియొ ద్దీన్, నాయకులు ఆశెట్టి శ్రీనివాస్, పురుషోత్తం, గణేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.