పెండింగ్‌ పనులు నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-12-15T00:29:54+05:30 IST

జిల్లాలో ఎంపిక చేసిన మోడల్‌ పాఠశాలలో మన ఊరు మన బడి పెండింగ్‌ పనులు ఈనెల చివరి నాటికి పూర్తిచేసి ప్రారంభానికి సన్నద్ధం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ సంగీతసత్య నారాయణ అధికారులను ఆదేశించారు.

పెండింగ్‌ పనులు నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ముత్తారం, డిసెంబర్‌ 14: జిల్లాలో ఎంపిక చేసిన మోడల్‌ పాఠశాలలో మన ఊరు మన బడి పెండింగ్‌ పనులు ఈనెల చివరి నాటికి పూర్తిచేసి ప్రారంభానికి సన్నద్ధం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ సంగీతసత్య నారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం ము త్తారం మండలంలో పర్యటించిన కలెక్టర్‌ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను తనిఖీ చేశారు. ముత్తారం మండలం లక్కారం గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్‌ పాఠశాల, కేశనపల్లి గ్రామంలోని అప్పర్‌ పైమ్రరీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ మన ఊరు మనబడి కింద చేపట్టిన స్ట్రక్చరల్‌ పనులు పూర్తి చేయా లని, మిగిలి ఉన్న చిన్నచిన్న మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేసి, పాఠశాలలు పెయింటింగ్‌ పనులు ప్రారంభిం చాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. మోడల్‌ పాఠశాలలను డిసెంబర్‌ చివరి నాటికి ప్రారంభించేం దుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి అనుగుణం గా త్వరలో పాఠశాలకు ఫర్నిచర్‌, గ్రీన్‌ బోర్డు వస్తాయని కలెక్టర్‌ తెలిపారు. పాఠశాలలకు పెయింటింగ్‌ పకడ్బందీగా జరిగేలా అధికా రులు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెయింటింగ్‌ జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో ఈఈ పంచాయతీరాజ్‌ మునిరాజు, ఈఈ ఆర్‌అండ్‌బీ నరసింహచారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:29:58+05:30 IST